UAE Visit Visas: విదేశీయులకు గుడ్‌న్యూస్.. రూ.16వేలు చెల్లిస్తే చాలు.. వీసా గడువు 30 రోజుల వరకు పెంచుకునే వెసులుబాటు
ABN , First Publish Date - 2023-07-11T08:02:48+05:30 IST
తమ దేశ సందర్శనకు వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) గుడ్‌న్యూస్ చెప్పింది.
అబుదాబి: తమ దేశ సందర్శనకు వచ్చే విదేశీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) గుడ్‌న్యూస్ చెప్పింది. స్నేహితుడు లేదా బంధువు సందర్శనకు వచ్చేవారు యూఏఈఐసీపీ (UAEICP) స్మార్ట్ యాప్ ద్వారా 750 దిర్హమ్స్ (రూ.16,850) చెల్లించి 30 రోజుల పాటు వీసా గడువును పొడిగించుకునే వీలు కల్పించింది. ఈ మేరకు తాజాగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (Federal Authority for Identity, Citizenship, Customs and Ports Security) కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ సర్వీసును పొందేందుకు కొన్ని ధృవపత్రాలు తప్పనిసరి అని పేర్కొంది.
ఒర్జినల్ ఎంట్రీ పర్మిట్, కలర్ ఫొటో, కనీసరం 6నెలల చెట్లుబాటుతో కూడిన పాస్‌పోర్ట్‌తో పాటు దరఖాస్తుదారు వీసా రెన్యువల్ సమయంలో దేశం లోపల ఉండాలని స్పష్టం చేసింది. ఇక వీసా ఫీజులో 500 దిర్హమ్స్ జారీ రుసుము, అప్లికేషన్ రుసుము 100 దిర్హమ్స్, 100 దిర్హమ్స్ స్మార్ట్ సర్వీసుల రుసుము, అలాగే బీమా, ఐసీపీ రుసుములకు అదనంగా 50 దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఐసీపీ యాప్‌ను ఉపయోగించి యూఏఈలోని నివాసితులు తమ బంధువు లేదా స్నేహితుడికి విజిట్ వీసా జారీ సర్వీసును ఎంచుకోవడం ద్వారా సులభమైన దశలతో స్మార్ట్ అప్లికేషన్ ద్వారా విదేశాల్లో ఉన్న బంధువు లేదా మిత్రుడి కోసం విజిటింగ్ వీసా (Visiting Visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఐసీపీ తెలియజేసింది.