NRI BRS: గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీనే.. అరవింద్‌పై ఎన్నారైల ఫైర్
ABN , First Publish Date - 2023-11-26T06:47:19+05:30 IST
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
NRI BRS: గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి. గత తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ పుభుత్వం గల్ఫ్ కార్మికులను మోసం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎన్నో సందర్భాల్లో కేంద్ర నాయకులను కలిసి కనీస వేతనాలు కల్పించాలని, పిలిఫిన్స్ తరహా చట్టలను తీసుక రావాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. రాష్ట్రాం రాక ముందు సరైనా ఉపాధి లేక వ్యవసాయం చేద్దామంటే సాగు నీరు లేక గల్ఫ్ దేశాలకు వలసలు పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలే అని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం వారు చేయవలసిన పనులు సరిగా చేయకుండా బీజేపీ ఎమ్మేల్యే అభ్యర్థి అరవింద్ గల్ఫ్ కుటుంబాల మీద కపట ప్రేమలు చూపిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మీద అసత్వ ప్రచారాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నో గల్ఫ్ కుటుంబాలను ఆదుకొని వారి కుటుంబలో వెలుగులు నింపింది ఎమ్మెల్సీ కవిత అని గుర్తు చేశారు.
ఎన్నారై ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఎన్నో సందర్భల్లో సీఏం కేసీఆర్ చెప్పారు. మన రాష్ట్రంలో చేసుకున్నంత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉపాధి పొందుతున్నారు. మీరు మీ కుటుంబసభ్యులను వదిలిపెట్టి 20, 30 వేల జీతాలకు గల్ఫ్‌కు పోతున్నారు. అక్కడ కష్టాపడుతున్నారు. చిన్న చిన్న తప్పులు చేసి ఇబ్బంది తెచ్చు కుంటున్నారు. రాష్ట్రాం ఏర్పడిన తరువాత గత 9 సంవత్సరాల కాలంలో గల్ఫ్ వలసలు చాలా తగ్గినాయి. చాలా సందర్భంలో బీఆర్ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ చెప్పారు గల్ఫ్ కార్మికులు 20, 30 వేల జీతాలు ఉంటే దయచేసి గల్ఫ్ నుండి తిరిగిరండి. మీకు ఉపాధి అవకాశం నేను కల్పిస్తాను అని ఎన్నోసార్లు చెప్పారు.
బహ్రెయిన్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సుమన్ అన్నారం మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇతర దేశాల నుండి గల్ఫ్‌కు పోతే వారికి ఎక్కువ వేతనాలు కావాలని వారి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మా వాళ్ళు వస్తే తక్కువ జీతాలు ఇచ్చిన పరవాలేదని మనోళ్లతో వెట్టిచాకిరి చేయిస్తోంది. గల్ఫ్ కార్మికుల శ్రమ దోపిడీని బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తోంది. అంతటితో ఆగకుండా అధికారికంగా మా వారిని పంపిస్తామని చెప్పి జీడీ జారీ చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా. వారు ఇప్పటికైన సిగ్గుండాలి. వారే ఇప్పుడు గల్ఫ్ వారి మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. మతపిచ్చి లేపే బీజేపీని చెత్తకుప్పలో పడేయాలని, కాంగ్రెస్ దుష్ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డులో ప్రతి మూడు నెలల ఒకసారి బయెమెట్రిక్ పంచ్ విధానం తెచ్చింది. గల్ఫ్ కార్మికులకు తరచూ రావాలంటే చాలా ఇబ్బంది ఆవుతుంది.
సతీష్ గొట్టెముక్కల మాట్లాడుతూ.. ఇప్పుడు సీఏం కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించారు. అనుకొకుండా వారికి ఎదైనా జరిగితే వారి కుటుబం రోడ్డు మీద పడకుండా, వారి కుటుంబానికి ధీమాగా ఉంటుంది. సీఏం కేసీఆర్ ఎన్నారైల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గల్ఫ్ కుటుంబాలు దయచేసి ఆలోచన చేయాలి. గల్ఫ్ కుంటుంచాలకు ఎవ్వరు ఏం చేశారని అని అన్నారు. నవంబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి డా. సంజయ్ కుమార్‌ను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని, కేటీఆర్‌ను ముడొసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుట్ల గల్ఫ్ కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. సతీష్ రాదారపు BRS బెహ్రాన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సుమన్ అన్నారం, సతీష్ గొట్టెముక్కల, మారుతీ మ్యాక, సుభాష్, ప్రహ్లాద కిశోరె, సూర్య గన్నరపు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.