Oman: 5 మిలియన్ల మైలురాయిని దాటిన ఒమాన్ జనాభా.. విదేశీయులు ఎంతమంది అంటే..
ABN , First Publish Date - 2023-03-24T10:07:17+05:30 IST
గల్ఫ్ దేశం ఒమాన్ జనాభా (Oman Population) 5 మిలియన్ల మైలురాయిని దాటింది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్ జనాభా (Oman Population) 5 మిలియన్ల మైలురాయిని దాటింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (National Centre for Statistics and Information) విడుదల చేసిన గణాంకాల ప్రకారం బుధవారం (మార్చి 22) నాటికి ఒమాన్ జనాభా 5,000,772కు చేరింది. ఇందులో ఒమానీలు 2,881,313 (57.62 శాతం) ఉంటే.. మిగతా 2,119,459 మంది (42.38 శాతం) నివాసితులు ఉన్నారు. ఇక 2020 డిసెంబర్‌లో ప్రకటించిన జనాభా, గృహాలు, సంస్థల ఎలక్ట్రానిక్ సెన్సస్ ప్రకారం.. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే పదేళ్లలో జనాభా 61 శాతం మేర పెరిగింది. కాగా, 2040 నాటికి సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ జనాభా 8 మిలియన్లకు చేరుకుంటుందని హౌసింగ్, అర్బన్ ప్లానింగ్ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ అల్-షుయైలీ తెలిపారు. ఒమాన్ పాపులేషన్ 1980లో కేవలం 1.60లక్షలు మాత్రమే ఉండేది. ఆ తర్వాత 1993 నాటికి రెండు మిలియన్ల మార్క్‌ను అందుకుంది. అనంతరం 2009లో 3.17 మిలియన్లకు, 2015లో నాలుగు మిలియన్ల మార్క్‌ను దాటింది. ఇప్పుడు ఐదు మిలియన్ల మైలురాయిని దాటింది.
ఇది కూడా చదవండి: ఆ రెండు వీసాలపై యూఎస్ వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై వాటితో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..!