Kuwait: సత్ఫలితాలు ఇస్తున్న కువైటైజేషన్ పాలసీ.. గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా..
ABN , First Publish Date - 2023-01-29T12:00:55+05:30 IST
2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ సత్ఫలితాలను ఇస్తోంది.
లేబర్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన కువైటీలు.. అయినా ప్రవాసులదే హవా!
కువైత్ సిటీ: 2017లో తీసుకొచ్చిన కువైటైజేషన్ పాలసీ సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా వెలువడిన అధికారిక లేబర్ మార్కెట్ గణంకాలే దీనికి నిదర్శనం. గడిచిన ఐదేళ్లలో కువైత్ లేబర్ మార్కెట్‌లో స్థానిక కార్మికుల సంఖ్య దాదాపు 1శాతం మేర పెరిగి ప్రస్తుతం 22.2శాతానికి చేరింది. దీంతో 2022, సెప్టెంబర్ 30 వరకు పబ్లిక్, ప్రైవేట్ రంగాలలో కలిపి కువైటీ వర్కర్ల సంఖ్య 4,83,803 చేనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 1,84,953 మంది పురుషులు, 2,53,850 మంది మహిళలు ఉన్నారు. ఇక ఇదే సమయానికి రెండు సెక్టార్లలో కలిపి విదేశీ కార్మికుల సంఖ్య 15,38,216గా ఉంది. దీంతో ప్రస్తుతం కువైత్ లేబర్ మార్కెట్‌లో విదేశీ కార్మికుల వాటా 77.8శాతంగా ఉంది. అయితే, ఇందులో డొమెస్టిక్ వర్కర్లను కలపలేదు.