Swadesam: పలు సర్వీసుల కోసం ఎన్నారైలకు మెంబర్‌షిప్ ప్రారంభించిన 'స్వదేశం' సంస్థ
ABN , First Publish Date - 2023-11-17T10:42:49+05:30 IST
ఎన్నారైలకు సేవలు అందిస్తున్న 'స్వదేశం' సంస్థ సభ్యత్వం నమోదు ప్రారంభించింది. ఈ సభ్యత్వానికి సంబంధించిన డిజిటల్ ఐడీ కార్డులను అందించనుంది. దీంతో స్వదేశం సభ్యత్వం తీసుకున్న వారికి మరింత సులువుగా, వేగంగా తమ సర్వీసులు అందించడం వీలు అవుతుందని నిర్వాహకురాలు స్వాతి తెలిపారు.
ఎన్నారై డెస్క్: ఎన్నారైలకు సేవలు అందిస్తున్న 'స్వదేశం' సంస్థ సభ్యత్వం నమోదు ప్రారంభించింది. ఈ సభ్యత్వానికి సంబంధించిన డిజిటల్ ఐడీ కార్డులను అందించనుంది. దీంతో స్వదేశం సభ్యత్వం తీసుకున్న వారికి మరింత సులువుగా, వేగంగా తమ సర్వీసులు అందించడం వీలు అవుతుందని నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. ప్రవాస భారతీయులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇక స్వదేశంలో సభ్యత్వం కోసం ఎన్నారైలు www. swadesam.com లో ఉన్న గూగుల్ ఫామ్‌లో సంబంధిత వివరాలు ఫొటోతో సహా అందించాల్సి ఉంటుంది. ఫామ్ పూర్తి చేసి సబ్‌మిట్ చేసిన ఎన్నారైలకు మెయిల్ ద్వారా త్వరలో డిజిటల్ ఐడీలు అందించడం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. కాగా, ఉపాధి, చదువు, బిజినెస్ ఇలా వివిధ అవసరాల కోసం వేర్వేరు దేశాలలో ఎంతో మంది భారతీయులు స్థిరపడ్డారు. వారికి భారత్ నుంచి ఎన్నో రకాల సర్వీసులు అవసరం అవుతుంటాయి. ఆ సర్వీసులు పొందాలంటే తెలిసినవారితో ప్రత్నించడడం జరుగుతుంది.
NRI News: మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు అప్పగించిన జో బైడెన్
కానీ, కొన్నిసార్లు వారు కూడా అందుబాటులో ఉండరు. ఇలాంటి సమస్యలు చాలా మంది ఎన్నారైలు ఎదుర్కొంటున్నారు. వారందరికీ స్వదేశం వన్ స్టాప్ సొల్యూషన్ అని 'మీడియా బాస్ నెట్‌వర్క్' సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. 56 దేశాల్లోని ప్రవాసులకు అతి తక్కువ ఛార్జీలతోనే తమ సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రవాసులకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సర్వీసులు అందిస్తున్నామని, త్వరలోనే దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా తమ సేవలు విస్తరించే ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇక స్వదేశం సర్వీసుల్లో మీడియా కంటెంట్, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, లీగల్, ప్రాపర్టీ వ్యవహరాలు, రిజిస్ట్రేషన్‌లు, ఫ్రీలాన్స్ ఉద్యోగులు, వస్తువుల డెలివరీ, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్, మాట్రిమోనీ సేవలు, ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసులు.. ఇలా ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నారైలకు ఎలాంటి సర్వీసులు కావాలన్నా వెబ్‌సైట్‌లోని ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు వివరాలు ఇస్తే సరిపోతుందన్నారు.