Telugu NRI: కూరశావులో తొలి తెలుగు వైద్యుడిగా డా. అల్లూరి వాసు
ABN , First Publish Date - 2023-06-03T10:51:44+05:30 IST
నెదర్‌ల్యాండ్ దీవుల్లోని కూరాశవు (Curacao) దేశంలో హృద్రోగ వైద్య సేవలందించే తొలి తెలుగు వైద్యుడిగా డా. అల్లూరి వాసు చరిత్ర సృష్టించారు.
ఎన్నారై డెస్క్: నెదర్‌ల్యాండ్ దీవుల్లోని కూరాశవు (Curacao) దేశంలో హృద్రోగ వైద్య సేవలందించే తొలి తెలుగు వైద్యుడిగా డా. అల్లూరి వాసు చరిత్ర సృష్టించారు. ఈ మేరకు అక్కడి స్థానిక ప్రభుత్వాల నుండి ఆయన అధికారిక గుర్తింపు పొందారు. ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో కూరశావులో ఏర్పాటు చేసిన ప్రముఖ వైద్య విశ్వవిద్యాలయం సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ (St. Martinus University) లో వాసు ప్రొఫెసర్‌గా, విశ్వవిద్యాలయ అధ్యాపకుల కమిటీకి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. బెజవాడ పిన్నమనేని సిద్ధార్థ పూర్వ విద్యార్థి అయిన వాసు.. యూకే (United Kingdom) నుండి కార్డియాలజీలో డిప్లోమా పట్టా ఉంది. అల్లూరి వాసుకు తాజాగా దక్కిన గుర్తింపు పట్ల ప్రవాసులు ఆయనకు అభినందనలు తెలిపారు.