Sankranthi Festival: దుబాయిలో వైభవంగా గోదాదేవి రంగనాథుల కల్యాణం

ABN , First Publish Date - 2023-01-18T07:39:48+05:30 IST

దుబాయిలో ఉంటున్న తెలుగు ప్రవాసీలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Sankranthi Festival: దుబాయిలో వైభవంగా గోదాదేవి రంగనాథుల కల్యాణం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): దుబాయిలో ఉంటున్న తెలుగు ప్రవాసీలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. దుబాయి తెలుగు అసోసియేషన్‌, తెలుగు తరంగిణి ప్రవాసీ సంఘాల ఆధ్వర్యంలో రస్‌ అల్‌ ఖైమాలో అట్టహాసంగా ఉత్సవాలను నిర్వహించారు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తనలతో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తిరుప్పావై అనంతరం నిర్వహించిన గోదాదేవి రంగనాథుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అన్నమయ్య కీర్తనలు, విద్యార్థుల కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్‌ బృంద భజనలు, చందా మేళం అందరినీ ఆకట్టుకున్నాయి. గోదారంగనాథ స్వామి పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, కళలకు తాము ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని దుబాయి తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు దినేష్‌ ఉగ్గిన, తెలుగు తరంగిణి అధ్యక్షుడు వక్కలగడ్డ వెంకట సురేశ్‌ తెలిపారు.

Updated Date - 2023-01-18T07:39:49+05:30 IST