UAE visit visa: యూఏఈ వెళ్లేవారికి పండగలాంటి వార్త.. ఏకంగా 30 రోజుల పాటు ఎక్స్‌ట్రా బస..!

ABN , First Publish Date - 2023-06-03T07:53:46+05:30 IST

తమ దేశానికి వచ్చే పర్యాటకులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీపి కబురు చెప్పింది. 30 లేదా 60 రోజుల వ్యవధితో కూడిన విజిట్ వీసాపై (Visit Visa) యూఏఈ వచ్చిన పర్యాకులు.. ఇప్పుడు తమ బస వ్యవధిని మరో నెల రోజులు పొడిగించుకునే వెసులుబాటు కల్పించింది.

UAE visit visa: యూఏఈ వెళ్లేవారికి పండగలాంటి వార్త.. ఏకంగా 30 రోజుల పాటు ఎక్స్‌ట్రా బస..!

అబుదాబి: తమ దేశానికి వచ్చే పర్యాటకులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తీపి కబురు చెప్పింది. 30 లేదా 60 రోజుల వ్యవధితో కూడిన విజిట్ వీసాపై (Visit Visa) యూఏఈ వచ్చిన పర్యాకులు.. ఇప్పుడు తమ బస వ్యవధిని మరో నెల రోజులు పొడిగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (Federal Authority for Identity and Citizenship), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (General Directorate of Residency and Foreigners Affairs) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక యూఏఈ గతేడాది అక్టోబర్ నుంచి దాని వీసా విధానాలలో కీలక మార్పులు తీసుకువచ్చిన విషయం విదితమే. కాగా, ఐసీఏ (ICA) అధికారికి వెబ్‌సైట్ ప్రకారం.. 30 లేదా 60 రోజుల విజిట్ వీసాను కలిగి ఉన్న సందర్శకులు ఇప్పుడు అదనంగా 30 రోజుల బసకు అర్హులు. ఇక విజిట్ వీసా హోల్డర్‌కు (Visit Visa Holder) గరిష్ట పొడిగింపు వ్యవధి 120 రోజులుగా ఉంది. దేశంలోనే విజిట్ వీసా పొడిగింపు సాధ్యమవుతుందని, పొడిగింపు కోసం వారి వీసా జారీ చేసే ఏజెంట్‌ను తప్పనిసరిగా సంప్రదించాలని అమెర్ సెంటర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఒక పర్యాటకులు (Tourists) తమ బసను పొడిగించాలనుకుంటే వారికి వీసా జారీ చేసిన ట్రావెల్ ఏజెంట్ లేదా స్పాన్సర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోజ్ ఖాన్ అన్నారు. వీసా జారీ చేసిన మీ స్పాన్సర్ లేదా ట్రావెల్ ఏజెంట్ (Travel Agent) మీకు పొడిగింపు ప్రక్రియ, అవసరమైన ధృవపత్రాలు, రుసుము, ఇతర సంబంధిత వివరాలపై సమాచారాన్ని అందిస్తారని ఆయన తెలిపారు. అలాగే పొడిగింపు కోసం తగిన సమయాన్ని అనుమతించడానికి మీ ప్రస్తుత వీసా గడువు ముగిసేలోపు ఈ ప్రక్రియను ప్రారంభించడం చాలా ముఖ్యం అన్నారు. ఇక పర్యాటక వీసాను పొడిగించేందుకు పర్యాటకుల పాస్‌పోర్ట్ (Passport) తప్పనిసరి. జారీ చేసే ఏజెంట్ అవసరమైన పత్రాలపై మరిన్ని వివరాలను అందిస్తారు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సమర్పిస్తే 48 గంటలలోపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. వీసా పొడిగింపు రుసుము వచ్చేసి.. ఒక నెల వీసా పొడిగింపు రుసుము 1050 దిర్హమ్స్ (రూ. 23,556) అవుతుందని ఫిరోజ్ ఖాన్ తెలిపారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-03T07:58:21+05:30 IST