Sudan Crisis: సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు చర్యలు ముమ్మరం

ABN , First Publish Date - 2023-04-24T07:31:09+05:30 IST

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

Sudan Crisis: సుడాన్ నుంచి భారతీయుల తరలింపునకు చర్యలు ముమ్మరం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్‌ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి విమానాశ్రయాలు మూతపడటంతో రోడ్డు మార్గాల్లోనే సరిహద్దు దేశాలకు తరలించాలని భారత ఎంబసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సూడాన్‌లోని భారతీయులను తరలించేందుకు సౌదీ అరేబియా కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు సీ-130జే సైనిక విమానాలను జెడ్డాలో ఉంచామని, అలాగే ఐఎన్‌ఎ్‌స సుమేధా కూడా సూడాన్‌లోని పోర్టుకు చేరుకుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

Updated Date - 2023-04-24T07:31:09+05:30 IST