Kuwait: కువైత్‌లో విషాద ఘటన.. ఇద్దరు భారత ప్రవాసులు నీట మునిగి మృత్యువాత!
ABN , First Publish Date - 2023-03-26T08:40:33+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు భారత ప్రవాసులు (Indian Expats) నీట మునిగి మృత్యువాత పడ్డారు. ఖైరాన్‌లో (Khairan) ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. మృతులను సుకేష్, జోసెఫ్ మథాయ్ (టిజో)గా గుర్తించారు. వీరిద్దరూ లూలూ గ్రూపు ఉద్యోగులు (Lulu Group Employee). స్నేహితులతో కలిసి ఖైరాన్‌కు ఫన్ ట్రిప్ వెళ్లిన సందర్భంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కయాకింగ్ (Kayaking) చేస్తున్న సమయంలో వీరి బోటు అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో సుకేష్, జోసెఫ్ నీట మునిగి చనిపోయారు. 44 ఏళ్ల సుకేష్ లూలూ ఎక్స్‌ఛేంజ్‌లో (Lulu Exchange) కార్పొరేట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అలాగే 29 ఏళ్ల జోసెఫ్ అకౌంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరూ కేరళ వాసులే. సుకేష్‌ది కన్నూర్ జిల్లా కాగా, జోసెఫ్‌ది పతనంతిట్ట. ఈ ఇద్దరి మృతిపై లూలూ గ్రూప్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
ఇది కూడా చదవండి: అసలు గల్ఫ్ దేశంలో ఏం జరుగుతుంది..? ప్రవాసులను షాపింగ్స్ చేయకుండా నిరోధించడం ఏంటి..?!