NRI: దొంగల భయంతో ముందు జాగ్రత్త.. రూ.1.83 కోట్లను ఓ డస్ట్ బిన్‌లో పెట్టిమరీ విదేశాలకు వెళ్లిన మహిళ.. తిరిగొచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2023-02-09T20:13:26+05:30 IST

దొంగలకు దొరక్కుండా ఉండేందుకని చెత్త బెట్టలో రూ.1.83 కోట్లను దాచి ఊరెళ్లిన మహిళకు తిరిగొచ్చే సరికి ఊహించని షాక్ తగిలింది.

NRI: దొంగల భయంతో ముందు జాగ్రత్త.. రూ.1.83 కోట్లను ఓ డస్ట్ బిన్‌లో పెట్టిమరీ విదేశాలకు వెళ్లిన మహిళ.. తిరిగొచ్చి చూస్తే..

ఎన్నారై డెస్క్: దొంగల భయంతో ఓ దుబాయి మహిళ(Dubai woman) ముందు జాగ్రత్తగా రూ.1.83 కోట్లను(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) తన భవంతి మిద్దెపై ఉన్న చిన్న చెత్త బుట్టలో దాచి పెట్టింది. డబ్బు ఎవరికంటా పడకుండా అద్భుతమైన ప్లాన్ వేశాననుకుంది. ఆ తరువాత హ్యాపిగా టూర్ వెళ్లింది. కానీ.. తిరిగొచ్చేసరిగా ఆమెకు ఊహించిన షాక్ తగిలింది. ఇంటిపైకెళ్లి చూడగా చెత్త బుట్టలోని డబ్బంతా మాయమైపోయింది. దీంతో లబోదిబోమన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని జల్లెడ పట్టారు. ఆమె భవంతిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో..డబ్బును ఎవరు దొంగిలించారో తెలిసొచ్చింది. బాధితురాలి ఇంట్లోని ఏసీ సర్వీసు కోసం ఇద్దరు వర్కర్లు వచ్చారు. వారిని విల్లా కాంప్లెక్స్ మెయింటెనెన్స్ కంపెనీయే పిలిపించింది. ఈ క్రమంలోనే వారికి చెత్తడబ్బాలో దాచిన డబ్బు కనిపించింది. ఆ మొత్తాన్ని చెరి సగం పంచుకుందామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు(Steal from Garbage bin). ఆలా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని వారి కుటుంబాలకు పంపించారు.

చివరకు పోలీసులకు చిక్కి చేసిన తప్పు ఒప్పేసుకున్నారు. నిందితులు తమ కుటుంబాలకు పంపించిన మొత్తాన్ని పోలీసులు రాబట్టగలిగారు. ఇక స్థానిక కోర్టు నిందితులిద్దరికీ మూడె నెలల కారాగార శిక్ష, 1.65 లక్షల దిర్హామ్‌ల జరిమానా విధించింది. శిక్ష పూర్తయ్యాక ఇద్దరినీ వారి వారి సొంత దేశాలకు పంపించేయాలంటూ(Deportation) తీర్పు వెలువరించింది.

Updated Date - 2023-02-09T20:19:16+05:30 IST