Midday break: యూఏఈ, ఖతార్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం వేళ పనికి బ్రేక్!
ABN , First Publish Date - 2023-06-02T07:52:55+05:30 IST
గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) వేసవి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చింది.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ దేశం ఖతార్ (Qatar) వేసవి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల పనివేళలను మార్చింది. వేసవిలో కార్మికులను రక్షించడానికి ఆ దేశ కార్మిక మంత్రిత్వ శాఖ పగటిపూట బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో చేసే పనులను పూర్తిగా నిషేధించింది. వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా సంభవించే ప్రమాదాల నుంచి వర్కర్లను సంరక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 మంత్రివర్గ తీర్మానం నం.17 ప్రకారం నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక ఈ నిర్ణయం అనేది ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల వరకు బహిరంగ ఆఫీసుల్లో తగిన వెంటిలేషన్ లేని, నీడ ఉన్న ప్రదేశాలలో చేసే పనిని నిషేధిస్తుందని మంత్రిత్వశాఖ తెలియజేసింది.
అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సైతం వేసవి కాలం నేపథ్యంలో మిడ్‌డే బ్రేక్ (Midday break) ప్రకటించింది. జూన్ 15 నుండి ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యక్ష సూర్యకాంతిలో పని చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Emiratisation) ప్రకటించింది. బహిరంగ కార్మికుల కోసం ఈ మధ్యాహ్న విరామం సెప్టెంబర్ 15, 2023 వరకు మూడు నెలల పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..
ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అండ్ లేబర్ అకామోడేషన్‌పై 2022 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (44)కి అనుగుణంగా మధ్యాహ్న విరామం ఉందని MoHRE తెలిపింది. ఇది కార్మికులను వృత్తిపరమైన ప్రమాదాల నుండి రక్షించే మరియు పని సంబంధిత గాయాలు లేదా అనారోగ్యాలను నివారించే తగిన పని వాతావరణాన్ని అందించడమే దాని లక్ష్యం. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మొహ్సేన్ అల్ నస్సీ మాట్లాడుతూ.. "కార్మికుల ఆరోగ్యం, భద్రత లేబర్ మార్కెట్ చట్టానికి మూలస్తంభం. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ అవసరమైన పరిస్థితులను రూపొందించడానికి కట్టుబడి ఉంది. వారికి సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే మా లక్ష్యం." అని అన్నారు.