Yusuff Ali: 52 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్‌ను కలిసిన లులూ గ్రూప్ అధినేత.. తాను చదివిన స్కూల్‌కు భారీ డొనేషన్!

ABN , First Publish Date - 2023-08-18T08:54:35+05:30 IST

భారత్‌కు చెందిన బిజినెస్ టైకూన్, లులూ గ్రూప్ అధినేత ఏంఏ యూసఫ్ అలీ (M. A. Yusuff Ali) 52 ఏళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న కేరళలోని కరాంచీరాలో ఉన్న సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలను (St. Xavier's High School) సందర్శించారు.

Yusuff Ali: 52 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్‌ను కలిసిన లులూ గ్రూప్ అధినేత.. తాను చదివిన స్కూల్‌కు భారీ డొనేషన్!

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన బిజినెస్ టైకూన్, లులూ గ్రూప్ అధినేత ఏంఏ యూసఫ్ అలీ (M. A. Yusuff Ali) 52 ఏళ్ల తర్వాత తాను చిన్నప్పుడు చదువుకున్న కేరళలోని కరాంచీరాలో ఉన్న సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలను (St. Xavier's High School) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తన క్లాస్‌మేట్స్, మాజీ ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఐదు దశాబ్దాల తర్వాత తోటివారిని కలిసిన అలీ ఎమోషనల్ అయ్యారు. పాఠాలు నేర్చుకున్న తరగతి గదిలో బ్యాచ్‌మేట్స్‌ అందరూ కొద్దిసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం సహవిద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేశారు.

Ali.jpg

ఈ సందర్భంగా అలీ తన గురువును సత్కారించారు. అలాగే 'చిన్నప్పుడు నాకు మీరు చాలా నేర్పించారంటూ' గురువు పట్ల విధేయతను చాటుకున్నారు. చివరగా వెళ్లేటప్పుడు తన స్కూల్‌కు 2లక్షల దిర్హమ్స్ (రూ.45.21లక్షలు) విరాళం ప్రకటించారు. కాగా, 1973లో మొదటిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లిన అలీ.. తన మామకు చెందిన కిరాణ షాపులో సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తన చురుకైన వ్యాపార చతురతతో 1990లో లులూ గ్రూప్ ఆఫ్ హైపర్ మార్కెట్‌ (Lulu Group Highper Market) ను స్థాపించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం లులూ గ్రూప్‌ అరబ్ దేశాలతో పాటు ఇతర దేశాలలో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది.

Yusuf-Ali.jpg

US: భారతీయ విద్యార్థులకు షాక్.. ఎయిర్‌‌పోర్టు నుంచే 21 మందిని వెనక్కి పంపించేసిన అమెరికా.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2023-08-18T08:57:00+05:30 IST