Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా..

ABN, First Publish Date - 2023-11-25T12:05:03+05:30 IST

సిరా చుక్క.. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలకు చిహ్నం. మనం ఓటేశామని చెప్పడానికి సిరా చుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు.. దొంగ ఓట్లను చెక్ పెట్టే ఆయుధం. తద్వారా ఓటరు మళ్లీ మళ్లీ ఓటు వేయలేరు. ఈ ఎలక్టోరల్ ఇంక్ ఓటింగ్‌లో మోసాల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. ఎన్నికల్లో ఉపయోగించే సిరాను చెరగని సిరా అని కూడా అంటారు.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 1/6

గత 62 ఏళ్లుగా ప్రతి ఎన్నికల సమయంలో ఈ ఇంక్ ఉపయోగిస్తున్నారు. ఈ సిరా ధర గురించి కూడా మనలో చాలా మందికి తెలియదు. ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. ఒక లీటర్ ఎన్నికల ఇంక్ ధర రూ.12,700.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 2/6

భారతదేశంలో ఈ సిరాను మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. మొదట్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రమే ఈ ఇంక్‌ను ఉపయోగించగా.. ఆ తర్వాత మునిసిపల్ బాడీలు, సహకార సంఘాల ఎన్నికల్లోనూ ఉపయోగించడం ప్రారంభించారు.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 3/6

ఈ నీలం రంగు సిరా 1962 ఎన్నికల్లో తొలిసారి ఉపయోగించారు. భారత తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఈ సిరాను ఎన్నికల్లో చేర్చాలని సూచించారు.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 4/6

ఎన్నికల సిరా తయారీలో సిల్వర్ నైట్రేట్ ఉపయోగించబడుతుంది. అందువల్ల, ఒకసారి పెట్టిన తర్వాత అది సులభంగా చెరిగిపోదు.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 5/6

ఈ సిరా కనీసం 72 గంటల పాటు వేలి నుంచి చెరిగిపోదు. అంతే కాకుండా నీటికి తాకినప్పుడు మరింత నల్లగా మారి ఎక్కువ కాలం ఉంటుంది.

Assembly Elections 2023: ఓటు వేసిన వెంటనే వేలిపై ఉన్న సిరా చుక్క ఎందుకు చెరిగిపోదో తెలుసా.. 6/6

మొదట్లో సిరాను చిన్న బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవారు, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్‌లను తీసుకొచ్చారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి.

Updated at - 2023-11-25T12:05:04+05:30