Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే..

ABN, Publish Date - Dec 23 , 2023 | 07:21 PM

ప్రస్తుత ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర కారణాలతో పెద్దలతో పాటూ చిన్న పిల్లలు కూడా అనేక రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు. తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థాలు చాలా ఉంటాయి

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 1/6

ప్రస్తుత ఆహార అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర కారణాలతో పెద్దలతో పాటూ చిన్న పిల్లలు కూడా అనేక రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు చిన్న చిన్న పనులకే త్వరగా అలసిపోతుంటారు. తక్షణ శక్తినిచ్చే ఆహార పదార్థాలు చాలా ఉంటాయి. వాటిలో ప్రధానంగా ఈ ఐదింటినీ తీసుకోవడం వల్ల శరీరం కొత్త శక్తిని సంతరించుకుంటుందట. అవేంటంటే..

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 2/6

ఓట్స్‌లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో పాటూ విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి పుడుతుంది. ఓట్ మీల్‌లో ఉండే ఫైబర్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీంతో బరువు తగ్గేందుకూ దోహదం చేస్తాయి.

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 3/6

క్వినోవాలో ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. తద్వారా ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. క్వినోవాను సూప్‌గా కూడా తీసుకోవచ్చు.

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 4/6

చియా గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో సహా చాలా పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం పాటు మీ శరీరానికి శక్తి అందుతుంది. ఈ విత్తనాలను పెరుగుతో జోడించి కూడా తీసుకోవచ్చు.

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 5/6

బాదం పప్పులోని ఫైబర్, ప్రొటీన్లు మీ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. రోజూ విధిగా కొన్ని బాదం పప్పులను తీసుకుంటూ ఎంతో మంచిది. నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల కూడా శరీరానికి పోషకాలు అందుతాయి.

 Energy Food: త్వరగా అలసిపోతున్నారా.. అయితే ఈ ఐదింటినీ తీసుకుంటే కొత్త శక్తి వచ్చినట్లే.. 6/6

అరటిపండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు, పొటాషియం శరీరానికి తక్షణ, దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. రోజూ అరటిపండు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది. అలాగే ఇందులోని పొటాషియం రక్తపోటును తగ్గించడమే కాకుండా, గుండెపోటు రాకుండా అడ్డుకుంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

Updated at - Jan 10 , 2024 | 10:57 AM