JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?
ABN , First Publish Date - 2023-08-07T17:48:31+05:30 IST
ఉప్పు-నిప్పులా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayana) కలిశారు!. ఇద్దరూ చేతులు కలిపారు.. నవ్వుకున్నారు.. పక్క సీటులోనే సీఎం కూర్చోబెట్టుకున్నారు..! అలా ఇద్దరూ ఒకే స్టేజ్ దర్శనమిచ్చారో లేదో ఇక చిత్రవిచిత్రాలుగా వార్తలు..!
ఉప్పు-నిప్పులా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayana) కలిశారు!. ఇద్దరూ చేతులు కలిపారు.. నవ్వుకున్నారు.. పక్క సీటులోనే సీఎం కూర్చోబెట్టుకున్నారు..! అలా ఇద్దరూ ఒకే స్టేజ్ దర్శనమిచ్చారో లేదో ఇక చిత్రవిచిత్రాలుగా వార్తలు..! తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ..! కొన్ని మీడియా సంస్థలు ఇంకో అడుగు ముందుకేసి.. లోక్‌సత్తాను వైసీపీలో (Lok Satta- YSRCP) కలిపేస్తున్నారని.. ఇది వీలుకాని పక్షంలో వైసీపీ మద్దతుతో ఎంపీగా పోటీచేస్తారని కూడా వార్తలు గుప్పుమన్నాయ్.! అంతేకాదండోయ్.. రెండు నియోజకవర్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయని విజయవాడ లేదా గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి జేపీని పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచనని వార్తలొచ్చాయ్!. మేథావి, ఒక పార్టీ అధినేత అయ్యుండి జగన్‌ను ఎందుకు కలిశారు..? అసలు సీఎంతో వేదిక పంచుకోవాల్సిన అవసరమేంటి..? ఎన్నికల వేళ వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా..? అనే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల ప్రజానికం, అభిమానులు, రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఉత్పన్నమైన ప్రశ్నలు. అయితే ఇందులో నిజానిజాలెంత..? జేపీ నిజంగానే వైసీపీ మద్దతుతో ఎంపీగా పోటీచేస్తున్నారా..? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఇదీ అసలు కథ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నాయి. దీంతో రెండోసారి అధికారంలోకి రావడానికి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan) ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎవరైతే తన ప్రభుత్వాన్ని ఇన్నాళ్లు విమర్శించడం.. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ వచ్చారో వారిని మచ్చిక చేసుకునే పనిలో జగన్ పడ్డారని గత కొన్నిరోజులుగా వార్తలొస్తు్న్నాయ్. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌ను (Undavalli Arun Kumar) జగన్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. అందుకే ఆ మధ్య అస్తమాను ప్రభుత్వాన్ని విమర్శించే ఆయన.. ఈ మధ్య సైలెంట్ అయ్యారని టాక్ నడిచింది. ఆ వ్యవహారం అలా ముగిసిందో లేదో.. సీఎంతో కలిసి మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ (Dr Jayaprakash Narayan) వేదిక పంచుకున్నారు. విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో జేపీ పాల్గొన్నారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఒక్కసారిగా ఇలా జగన్‌తో కలిసి ఇలా దర్శనమివ్వడాన్ని చూసిన జనాలు, అభిమానులు ఆశ్చర్యపోయారు. జేపీ వేదికపైకి వచ్చే సమయంలో లేచి నిలబడటం, జగనే షేక్ హ్యాండ్ ఇవ్వడం, పక్క పక్కనే కూర్చోవడం.. నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం ఇవన్నీ జరిగాక ఇక అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో ఒక్కటే వార్తలు. జేపీ-జగన్ కలిసిపోయారు.. కొన్నిరోజులుగా జగన్ ప్రభుత్వాన్ని జయప్రకాష్ కూడా ప్రశంసిస్తూ ఉండటం, సడన్‌గా ఇలా వేదికను పంచుకోవడం ఇవన్నీ రాజకీయంగా వైసీపీకి దగ్గర చేస్తున్నాయని ఎక్కడ చూసినా ఇదే టాక్ నడిచింది.
జేపీని బరిలోకి దింపుతారని..!
2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి (Kukatpally) నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలవడం.. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్(Malkajgiri Parliament) నుంచి పోటీచే ఓటమిపాలయ్యారు. అప్పట్నుంచీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్న జేపీ ఇటీవల వైఖరి మార్చుకున్నట్లు తెలియవచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద రచ్చ జరుగుతున్న టైమ్‌లో.. ఆ వ్యవస్థను జేపీ సమర్థించడం, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సూపర్బ్ అని కితాబివ్వడం.. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే వైసీపీకి కూడా అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక గౌరవం ఇవ్వడం.. ఏకంగా ఎలాంటి సంబంధం లేని ప్రభుత్వ కార్యక్రమాల్లో అది కూడా జగన్‌తో కలిసి స్టేజ్ పంచుకోవడంతో వైసీపీ మద్దతుతో లేదా లోక్‌సత్తాను విలీనం చేస్తారని టాక్ నడిచింది. వీలుకాని పక్షంలో వైసీపీ మద్దతుతోనే విజయవాడ (Vijayawada) లేదా గుంటూరు (Gunturu) ఎంపీగా పోటీచేస్తారని వార్తలొచ్చాయి. అది కూడా వీలుకాకపోతే రాజ్యసభకు (Rajyasabha) అయినా జగన్ పంపుతారని కూడా టాక్ నడిచింది. ఈ వ్యవహారం రెండు, మూడ్రోజులుగా అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. దీంతో ఎట్టకేలకు లోక్‌సత్తా స్పందించింది.
ఫుల్ క్లారిటీ..
జేపీ గురించి వస్తున్న వార్తలపై లోక్‌సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి స్పందించారు. ‘ జేపీ వైసీపీలో చేరుతున్నారన్న వార్తలన్నీ అవాస్తవమే. ఆయన ఏ పార్టీలోనూ చేరట్లేదు. గతంలో జయప్రకాష్ ఆప్కాబ్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు’ అని బాబ్జి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. చూశారుగా.. ఇదీ అసలు విషయం. జేపీ ఏ పార్టీలో చేరట్లేదు.. ఎక్కడ్నుంచీ పోటీచేయట్లేదు.. అని లోక్‌సత్తా నుంచి క్లారిటీ వచ్చేసిందన్న మాట. ఇప్పటికైనా జేపీ పైన వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడతాయో లేదో వేచి చూడాలి మరి.