AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?

ABN , First Publish Date - 2023-08-12T17:50:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడే కొద్ది అధికార వైసీపీలో (YSR Congress) జోష్ రావాల్సింది పోయి.. భయం మొదలైంది.! రానున్న ఎన్నికల్లో గెలవలేమనే భయం మొదలైందో లేకుంటే టీడీపీ (Telugudesam) అధికారంలోకి వస్తే పరిస్థితేంటని కంగారో తెలియట్లేదు కానీ.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మాత్రం భయం గుప్పిట్లో బతికేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.!..

AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడే కొద్ది అధికార వైసీపీలో (YSR Congress) జోష్ రావాల్సింది పోయి.. భయం మొదలైంది.! రానున్న ఎన్నికల్లో గెలవలేమనే భయం మొదలైందో లేకుంటే టీడీపీ (Telugudesam) అధికారంలోకి వస్తే పరిస్థితేంటని కంగారో తెలియట్లేదు కానీ.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మాత్రం భయం గుప్పిట్లో బతికేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.! అదెలాగంటే.. ఈయన బయటికి వెళ్లాలన్నా.. ప్రతిపక్ష నేతలు బయటికొచ్చినా సరే అదేదో తెలియని భయం పుడుతోంది.! ఈ క్రమంలో ఎప్పుడూ లేని జీవోలు తెరపైకి వస్తున్నాయ్.. మునుపెన్నడూ లేని షరతులు, నిబంధనలు, నోటీసులు దర్శనిమిస్తున్నాయ్.! వైఎస్ జగన్‌లో ఎందుకింత అలజడి మొదలైంది..? ఎన్నికల సీజన్‌లో ధైర్యంగా ముందుకెళ్లాల్సిన జగన్ ఇంతలా ఎందుకు జంకిపోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..


YS-Jagan.jpg

ఇదీ అసలు కథ..!

అమరావతి ఉద్యమం సమయం నుంచి వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి!. ఒకవేళ బయటికొచ్చినా పరదాల చాటున, ఆఖరికి చెట్లున్నా సరే వాటిని కూడా కొట్టేపించడం, కనీసం దారిపోడవునా షాపులు కానీ.. పాదాచారులు కానీ నడవనీయని పరిస్థితి.! అర్థమైందిగా జగన్ ఏ రేంజ్‌లో భయపడిపోతున్నారో..!. మునుపెన్నడైనా ఇలాంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాలతో పాటు మరెక్కడైనా చూశామా..? అంటే అబ్బే భూతద్దాలు పెట్టుకుని వెతికినా కనిపించవ్. పోనీ ఆయనకు ముప్పు ఉందనో.. లేకుంటే సెక్యూరిటీ సమస్య వల్లనో ఇలా చేస్తున్నారనుకుందాం.. మరి ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడినా గృహ నిర్భందాలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పొల్లెత్తు మాట మాట్లాడితే అరెస్టులు ఎందుకన్నది జగనన్నకే తెలియాలి మరి. ఇది కూడా అలా ఉంచితే.. కనీసం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), యువనేత నారా లోకేష్ (Nara Lokesh) .. బీజేపీ నేతలు (BJP Leaders) ఏమైనా మాట్లాడితే చాలు వారి నోరు మూయించే ప్రయత్నం చేస్తుండటాన్ని చూస్తుంటే వైఎస్ జగన్ ఎంత అభద్రతతో ఫీలవుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

cm-jagan-cabinet.jpg

బయటికొస్తే భయమెందుకో..!?

ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏ మాత్రం చేశారనేదానిపై డిబేట్స్ పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినా అడ్డంకులే..! కనీసం అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే చాలు ఇటీవలే మంత్రి ఒకరు ఆదాయ పన్ను విధించాలని సెలవిచ్చారు. ఎవరు పడితే వాళ్లు ప్రశ్నించొద్దట. పోనీ.. నియోజకవర్గాల పర్యటన, ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న చంద్రబాబుకు అయినా అనుమతిస్తారా అంటే.. అబ్బే అదీ లేదు. ఒకవేళ అనుమతులిచ్చినా లెక్కలేనన్ని షరతులు పెట్టడం జరుగుతోంది. నియోజకవర్గాల్లో పర్యటించినా సరే ఇంతకుమించి కండిషన్స్ పెడుతున్నారంటే ఎందుకో ఆ పోలీసు యంత్రాంగానికి.. వారిని ఆడిస్తున్న జగన్ ప్రభుత్వానికే (Jagan Govt) తెలియాలని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్న పరిస్థితి. ఆఖరికి పుంగనూరులో వైసీపీ, పోలీసులు (YSRCP, Police) ఎలా రెచ్చిపోయారో దేశమంతా చూసిందన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత చంద్రబాబుపైనే ప్రభుత్వం కేసులు నమోదు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.

Nara-Chandrababu.jpg

- యువగళం పాదయాత్రతో (YuvaGalam Padayatra) రాష్ట్ర ప్రజానీకానికి చేరువవుతున్న యువనేత నారా లోకేష్‌కు మైక్ ఇవ్వాలన్నా.. నిల్చుని మాట్లాడటానికి బెంచ్ ఇవ్వాలన్నా సరే ప్రభుత్వం భయపడిపోతోందంటే ఎక్కడ్నుంచి ఎక్కడికి సర్కార్ దిగజారిందో చెప్పడానికి ఇలాంటి ఒకట్రెండు సందర్భాలు చాలేమో.!. పాదయాత్ర ప్రారంభం అయినా రోజు నుంచీ ఆయనకొస్తున్న ఆదరణను.. ఏ సభలో చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.. వేలాది మంది ఆయనకు స్వాగతం పలకడాన్ని కూడా వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో అడుగడుగునా అడ్డంకులే సృష్టిస్తోందే తప్ప ఏ ఒక్కరోజూ ప్రశాంతంగా పాదయాత్ర చేయనిచ్చిన పరిస్థితుల్లేవనే ఆరోపణలు టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం, ఎమ్మెల్యేల అవినీతిని ఏ రోజైతే లోకేష్ ప్రశ్నిస్తారో ఆ మరుసటిరోజే లోకేష్‌కు ఇబ్బందులు తప్పనిసరన్నట్లుగా ఉంది.

Pawan.jpeg

- ఇక పవన్ విషయానికొస్తే.. పవన్ హైదరాబాద్ నుంచి మంగళగిరికి వచ్చినా.. ఎక్కడైనా పర్యటించినా లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఆఖరికి నోటీసులు కూడా ఇచ్చి వివరణ ఇవ్వాలని అడిగిన పరిస్థితి. నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినా ఆంక్షలే. నిన్న వైజాగ్ రిషికొండకు వెళ్తే ఎన్నెన్ని ఇబ్బందులు ప్రభుత్వం పెట్టిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో. సేనాని ప్రెస్‌మీట్ పెట్టినా రచ్చే.. ఏమైనా మాట్లాడితే చాలు ఇక వైసీపీ మంత్రులు, మాజీలు, ముఖ్యనేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి వాలిపోయి విమర్శలు గుప్పిస్తుంటారు. కనీసం పవన్ ఏం మాట్లాడారు..? కౌంటర్‌గా ఏం మాట్లాడాలి..? అనేదేమీ ఉండదు.. విమర్శలు గుప్పించాలి.. వార్తల్లో నిలవాలంతే అన్నట్లుగా మీడియా గొట్టాల ముందుకు క్యూ కట్టేస్తుంటారు.

Nara-Lokesh.jpg

ఎందుకింత భయం..?

చంద్రబాబు పర్యటన, లోకేష్ పాదయాత్ర, పవన్ నియోజకవర్గాల పర్యటన ప్రశాంతంగా చేయనిస్తే ప్రభుత్వం సొమ్ము పోయేదేముంది..? ఒకవేళ ప్రాజెక్టుల నిర్మాణంలో, రిషికొండ నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేనప్పుడు, సుప్రీంకోర్టు, ఎన్జీటీ నుంచి స్పష్టమైన డాక్యుమెంట్స్ ఉంటే ఇక వారిని ప్రశాంతంగా తిరగనివ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటి..? ఎందుకింత భయంగా.. అంతకుమించి అభద్రతగా జగన్ ఉంటున్నారో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే తెలియని పరిస్థితి. పోనీ.. ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తే ఇక వైసీపీ బ్యాచ్ సైలెంట్‌గా ఉంటుందా అంటే.. బాబోయ్ సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే బూతులే బూతులు.!. వ్యక్తిగతంగా కూడా విమర్శించిన రోజులున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక పాత వీడియోలు బయటికి తీసి మరీ రచ్చ రచ్చ చేసేస్తుంటారు.

TDP-Vs--YSRCP.jpg

ఇంత భయం గుప్పిట్లో ఉన్న జగన్.. అప్పట్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇలానే ఆంక్షలు పెట్టి ఉన్నా.. కనీసం సభకు కూడా అనుమతించకపోయి ఉంటే పరిస్థితేంటన్నది ఒక్కసారి వైసీపీ బ్యాచ్ ఊహించుకుంటే బాగుంటుందేమో.! అధికారంలోకి వచ్చామని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారే.. అప్పట్లో ఇదే ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు అనుకుని ఉంటే జగన్ పాదయాత్రలో అడుగు ముందుకు పడేదా అన్నది తెలుసుకుంటే మంచిదేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా ప్రశ్నించి.. తప్పొప్పులను ఎత్తిచూపితే కదా ప్రభుత్వం పనితీరు, విధి విధానాలు, పథకాల అమలు ఎలా ఉన్నాయనేది తెలిసేది. ఇవన్నీ కాదని ఒంటెద్దు పోకడతో పాలన సాగిస్తే ఎంతవరకు సక్సెస్ అవుతారో.. ఇవన్నీ రానున్న ఎన్నికల్లో ఏ మాత్రం ఇవన్నీ విజయం వైపు తీసుకెళ్తాయో వేచి చూడాలి మరి.

YSRCP.jpg


ఇవి కూడా చదవండి


AP Politics : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు.. ముహూర్తం ఫిక్స్..!



YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?


AP Politics : వామ్మో.. జగన్ సర్కార్ మరీ ఇంత దిగజారిందేంటి.. ఈ విషయం గానీ మీకు తెలిస్తే..!?


AP Politics : వైసీపీకి బాలినేని శ్రీనివాస్ నిజంగానే గుడ్ బై చెబుతున్నారా..!?


YSRTP : ఢిల్లీకెళ్లిన వైఎస్ షర్మిల హైదరాబాద్‌కు ఎలా వచ్చారంటే.. ఈ ఒక్క సీన్‌తో..!?


Updated Date - 2023-08-12T17:52:05+05:30 IST