Jagan Statement: జగన్‌ను కరివేపాకు అంటూ ఏపీ సీఐడీ తీసిపడేసిందా? ఇప్పుడు ఇదే చర్చ

ABN , First Publish Date - 2023-10-10T18:17:34+05:30 IST

కాసేపు జగన్ చెప్పిందే నిజమని అనుకుందాం. జగన్ లండన్‌లో ఉన్నప్పుడు సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారని అనుకుందాం. సీఐడీ వాళ్లు సీఎం జగన్‌ను కరివేపాకులా తీసిపడేశారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Jagan Statement: జగన్‌ను కరివేపాకు అంటూ ఏపీ సీఐడీ తీసిపడేసిందా? ఇప్పుడు ఇదే చర్చ

ఏపీలో రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి. వైనాట్ 175 అని గంతులేస్తున్న వైసీపీకి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత డోసు క్రమంగా పెరుగుతోంది. నిఖార్సైన సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సీఎం జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. అందుకే విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ గురించి తనకేమీ తెలియదని జగన్ బుకాయించారు. చంద్రబాబు అరెస్ట్ అని మాట ఎత్తగానే జగన్ ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. సీరియస్ మేటర్‌ను కూడా ముసిముసి నవ్వులతో చెప్పడంతోనే జగన్ ఉద్దేశం కూడా కనిపించింది. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదు. తాను ఏపీలో లేని టైంలోనే చంద్రబాబును పోలీసులు లోపలేశారని.. చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి.

అయితే కాసేపు జగన్ చెప్పిందే నిజమని అనుకుందాం. జగన్ లండన్‌లో ఉన్నప్పుడు సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారని అనుకుందాం. సాధారణంగా ప్రతిపక్ష నేత, అంతేకాకుండా 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే సీఐడీ వాళ్లు ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ సీఎం జగన్‌కు కనీసం సమాచారం ఇవ్వలేదా అంటే పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు విషయంలో సీఐడీ వాళ్లు జగన్‌కు చెప్పకుండా నిర్ణయం తీసుకున్న విషయం కరెక్ట్ అయితే.. సీఐడీ వాళ్లు సీఎం జగన్‌ను కరివేపాకులా తీసిపడేశారా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సీఎంకు కనీసం చెప్పకుండా గవర్నర్ అనుమతి తీసుకోకుండా ప్రతిపక్ష నేతను సీఐడీ అరెస్ట్ చేసిందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AP politics: అవునా పాపం.. లండన్‌లో ఉన్నావా? ప్రజలకు అన్నీ తెలుసులే..!!

మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా సీఎం జగన్ ఆత్మరక్షణలో పడ్డారని.. అందుకే తనకేమీ తెలియదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల నిడదవోలు సభలో చంద్రబాబు స్కాంస్టార్ అంటూ ఆరోపణలు చేసిన జగన్.. ఇప్పుడు పార్టీ సమావేశంలో మాత్రం బాబుపై పగలేదంటూ కామెంట్ చేశారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు చేసిన అతి వల్ల పార్టీకి చాలా డ్యామేజీ జరిగిందని.. అంతేకాకుండా చంద్రబాబుపై సానుభూతి పెరిగిందని జగన్ గ్రహించారని.. అందుకే ఆయన స్వరం మార్చారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మంత్రి రోజా బాణసంచా కాల్చడం.. లాయర్ల ఫీజులపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేస్తూ మాట్లాడటం వంటివి చూస్తే వైసీపీ కావాలనే ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఇరికించిందనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-10-10T18:17:34+05:30 IST