AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!
ABN , First Publish Date - 2023-08-14T20:35:21+05:30 IST
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు..
దమ్మున్న చానెల్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajoyothy) దెబ్బకు ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) తోక ముడిచేశారు..! అప్పటి వరకూ నోటికొచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో మంత్రి విమర్శించారు. ముఖ్యంగా గత కొన్నిరోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయిన ‘రుషికొండ’ (Rushikonda) విధ్వంసంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో సమాధానాలు చెప్పలేక మంత్రి నాలుక్కరుచుకున్నారు. ప్రశ్నించిన ఏబీఎన్ ప్రతినిధిపై (ABN Reporter) ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానాలు చెప్పలేక.. చెప్పడానికి ఏమీలేక.. ఇలా అక్కసు వెళ్లగక్కడం మంత్రిగారికే చెల్లుతుంది మరి..! ఇంతకీ ఏం జరిగింది..? ఇప్పుడెందుకింత రచ్చ అయ్యింది..? ఇంతకీ అమర్‌ను ఏబీఎన్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలేంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
ఇదీ అసలు కథ..!
రుషికొండపై జగన్ సర్కార్ (Jagan Govt) నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కరోజేమో సెక్రటేరియట్ (AP Secretariat) అని చెప్పి ప్రకటనలు ఇవ్వడం.. ఆ మరుసటిరోజే అబ్బే.. సెక్రటేరియటేమీ కాదు.. టూరిజం (AP Tourism) అభివృద్ధి కోసం నిర్మాణాలు చేపడుతున్నామని మళ్లీ మాట మార్చడం జరుగుతోంది. దీనిపై అధికార వైసీపీ.. టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. మరోవైపు.. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణే (Janasena Chief Pawan Kalyan) వెళ్లి సందర్శించి.. నిర్మాణాలపై మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డిపై శాపనార్థాలు పెట్టారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే.. నిర్మాణాల విషయంలో పవన్ సంధించిన ఏ ఒక్క ప్రశ్నకూ.. వైసీపీ నుంచి ఇప్పటి వరకూ సమాధానం రాకపోవడం గమనార్హం. ఇప్పుడే ఇదే విషయాన్ని మీడియా మీట్‌లో భాగంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించింది. అయితే ఏబీఎన్ ప్రతినిధి ప్రశ్నలకు నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోయారు మంత్రి. సమాధానాలు చెప్పకపోగా.. ఏబీఎన్‌పైనే అక్కసు వెళ్లగక్కారు.
ఏబీఎన్ ఏమడిగింది.. మంత్రి చెప్పిందేంటి..!?
ఏబీఎన్ ప్రతినిధి : రుషికొండ విధ్వంసంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ సమాధనం ఏమిటి..?
మంత్రి అమర్ : (ఏబీఎన్ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..) ఏబీఎన్, టీవీ-5 చానెల్స్‌కు ఎలాంటి ఇన్విటేషన్లు ఉండవు.. అయినా పిలవని పేరంటాలకు వస్తున్నారెందుకు..?
ఏబీఎన్ ప్రతినిధి : సీఎం జగన్ రెడ్డిపై పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలపైన అయినా కనీసం స్పందించండి..?
మంత్రి అమర్ : సమాధానాలు చెప్పలేక నీళ్లు మింగుతూ.. మిన్నకుండిపోయారు అమర్.
ఏబీఎన్ ప్రతినిధి : ఏంటి సార్ ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పరు..?
మంత్రి అమర్ : పెట్టింది తిని వెళ్ళాలంతే.. ఎందుకిలా చేస్తున్నారు.
ఏబీఎన్ ప్రతినిధి : ఇదేం పార్టీ కార్యక్రమం కాదు కదా సార్. ప్రభుత్వ కార్యక్రమం, విలేకరుల సమావేశం కాబట్టే మేం వచ్చామని మంత్రి అమర్‌కు ఏబీఎన్ ప్రతినిధి కౌంటర్
మంత్రి అమర్ : ఏబీఎన్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోకపోయిన పరిస్థితి.
చూశారుగా.. ఇదీ మంత్రి అమర్ పరిస్థితి. మంత్రి మీడియా మీట్‌కు వచ్చి ఏం చెప్పినా రాసుకొని వెళ్లాలంతే అన్నమాట. పొరపాటున కూడా ప్రశ్నలు సంధించకూడదన్నది అమర్ భావన. మరి ఇంత మాత్రానికి మీడియా ముందుకు రావడమెందుకు..? అనేది ఆయనకే తెలియాలి. ప్రశ్నలు అడిగితే స్పందించకపోవడమేంటని కొందరు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. మీడియా ప్రతినిధులు.. మంత్రిని సోషల్ మీడియాలో నిలదీస్తున్న పరిస్థితి.! మీడియా ముందుకు వస్తున్నారంటే అన్నింటికీ ప్రిపేరయ్యే రావాలి మంత్రిగారు.. సబ్జెక్ట్ లేకుండా, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. మీడియాపైనే అక్కసు వెళ్లగక్కేంతలా ఎందుకు ప్రవర్తించడం అంటూ వైసీపీ శ్రేణులే సోషల్ మీడియాలో మండిపడుతూ.. మంత్రినే తిట్టిపోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం నుంచి ఏ మాత్రం చీవాట్లు వస్తాయో..? మున్ముందు ఏబీఎన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేదానిపై అమర్ అభిమానులు, కార్యకర్తలు ఆంధోళన చెందుతున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.