TS BJP : కాషాయ పార్టీలో కీచులాట.. జాతీయ జెండా సాక్షిగా కొట్టుకున్నారు!

ABN , First Publish Date - 2023-08-15T22:55:13+05:30 IST

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.!

TS BJP : కాషాయ పార్టీలో కీచులాట.. జాతీయ జెండా సాక్షిగా కొట్టుకున్నారు!

అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ కాషాయపార్టీలో (BJP) కీచులాటలు ఎక్కువయ్యాయి.! వర్గపోరుతో నేతల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత పరిస్థితి వచ్చింది.! ఇందుకు నాంపల్లి, కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయాల్లో జరిగిన ఘటనలే సాక్ష్యం. ఈ ఘటనలు మరిచిపోకముందే.. పంద్రాగస్టు నాడు జాతీయ జెండా సాక్షిగా బీజేపీ నేతలు తన్నుకున్నారు.! ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పరస్పరం పార్టీ పెద్దలకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.!


Chinthala.jpg

అసలేం జరిగింది..?

యావత్ దేశమంతా మువ్వెన్నల జెండా ఎగరేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని (independence Day) జరుపుకుంటే బీజేపీ నేతలు మాత్రం తన్నుకున్నారు!. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బీజేపీలో వర్గపోరుతో కమలనాథుల మధ్య కీచులాట జరిగింది. ఒక్కసారిగా విభేదాలు భగ్గుమనడంతో కొట్టుకున్నారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Chintala Ramachandra Reddy).. స్థానిక కార్పొరేటర్ (Corporator) వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కార్పొరేటర్ భర్తకు గాయాలయ్యాయి. జాతీయ జెండా సాక్షిగా కమలం పార్టీ కార్యకర్తలు కొట్టుకున్న ఈ ఘటన గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఇరువర్గీయులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.

Ramanna-Gowd.jpg

గొడవ ఇందుకే..!

పంద్రాగస్టు కావడంతో మాజీ ఎమ్మెల్యే చింతల.. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల నడుమ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇంతవరకూ అంతా బాగుందిగానీ అసలు సీన్ మొదలైంది ఇప్పుడే.! అయితే.. కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా చేశారేంటి..? అని కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి (Gaddam Mahalakshmi), ఆమె భర్త రామన్ గౌడ్ (Raman Goud) అక్కడికెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో చింతల, రామన్ వర్గం బాహాబాహీకి దిగింది. ఈ దాడిలో కార్పొరేటర్ భర్తతో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ గొడవపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) ఒకరిపై ఇకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్నికల ముందు ఏంటీ గొడవలు..? అని కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

Kishan-And-Chintala.jpg

టికెట్ కోసమేనా..?

ఈ ఘటనపై రామన్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గానికి చెందిన తమను చింతల అణిచి వేస్తున్నారని కంటతడి పెట్టారు. పార్టీ కోసం 30ఏళ్ళుగా కష్టపడతుంటే చింతల చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఖైరతాబాద్ (Khairatabad) అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రామన్ గౌడ్ ఆశిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే.. అధిష్టానం మాత్రం అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. అందుకే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా ఒకరి నుంచి ఒకరికి ఎలాంటి సమాచారం ఉండదని తెలుస్తోంది.

Raman.jpg


ఇవి కూడా చదవండి


Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!


Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?


Updated Date - 2023-08-15T22:59:28+05:30 IST