Home » Khairatabad
తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Dana Nagender) అన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాలు, చెరువులు అన్యాక్రాంతమయ్యాయన్నారు.
Telangana: ఎన్నడూ చూడని విధంగా ఈసారి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాసేపటి క్రితమే సీఎం ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. రేవంత్‌ను చూసిన ప్రజలు కేరింతలు కొడుతున్నారు. తన వాహనం లోపల నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగుతున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.
ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
Telangana:ఖైరతాబాద్ వద్ద గణనాథుడి వద్ద కర్ర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మహా గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు చేరుకుంది. ఈరోజు బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నాలుగు వైపులా బారికేడ్లును పోలీసులు ఏర్పాటు చేశారు.
గణనాథుల ‘నిమజ్జనం’పై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావు లేదని బెట్టు చేసిన ట్యాంక్‌బండ్ ఎట్టకేలకు గణపతులకు స్వాగతం పలికింది.
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గంటకు సరాసరి మూడు నుంచి ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రధానంగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత..
గణేశ్ శోభాయాత్ర(Ganesh Shobhayatra)ను నగరవాసులు, భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్(Hyderabad City Police Commissioner) సిబ్బందిని ఆదేశించారు.
నిమజ్జనానికి రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ఖైరతాబాద్(Khairatabad) గణపతి వద్ద భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ఉత్సవాల 7వ రోజైన శుక్రవారం ఒక్కరోజే దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. శనివారం, ఆదివారం మాత్రమే ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మంగళవారం నాడు నిమజ్జనం చేస్తామన్నారు.