Telangana Politics: టీకాంగ్రెస్‌లో కీలక బీజేపీ నేత..15 రోజుల్లో నిర్ణయం ప్రకటన
ABN , First Publish Date - 2023-06-06T17:26:38+05:30 IST
కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణలో కాంగ్రెస్‌కు (Telangana congress) సానుకూలంగా మారతాయని, బీజేపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు ఖాయమంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన...
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణలో కాంగ్రెస్‌కు (Telangana congress) సానుకూలంగా మారతాయని, బీజేపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు ఖాయమంటూ విశ్లేషణలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలో బీజేపీ కీలక నేతల్లో ఒకరైన పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆసక్తికరమైన పరిణామానికి దారితీశారు. భాజపాలో సీఎం కేసీఆర్ కోవర్టులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవర్టుల పేర్లను భాజపా పెద్దలకు చెప్పానని , కోవర్టుల తీరు మారకపోతే పేర్లను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఆ కోవర్టులెవరో త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మరో 15 రోజుల్లో సంచలన ప్రకటన చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి నందీశ్వర్ గౌడ్...?
నందీశ్వర్ గౌడ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. పార్టీ మారే ఉద్దేశ్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. మరో 15 రోజుల్లో ప్రకటన చేస్తానని నందీశ్వర్ గౌడ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజంగానే కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? అనే చర్చ ఊపందుకుంది. కాగా నందీశ్వర్ గౌడ్ నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వలసలు ప్రారంభమయ్యాయా? అనే చర్చ తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకుంటే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరడం ఖాయమైపోయిందని, క్లియరెన్స్ అందిందని వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే.