Share News

CBN Arrest : ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. ‘స్కిల్’ సంగతేంటో..!?

ABN , First Publish Date - 2023-10-17T16:03:17+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail) ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది...

CBN Arrest : ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. ‘స్కిల్’ సంగతేంటో..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail) ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు.. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్ట్ (CBN Arrest) చేయొద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాబుకు కాస్త ఊరట లభించినట్లయ్యింది. అయితే.. శుక్రవారం నాడు కచ్చితంగా బెయిల్ విషయంలో శుభవార్తే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


CBN-Supreme.jpg

వాడివేడిగా వాదనలు..!

మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో చంద్రబాబుపై పిటిషన్‌పై ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంలో ఈ పిటిషన్‌పై ఇరువర్గాల లాయర్ల మధ్య వాడివేడీగా వాదనలు కొనసాగుతున్నాయి. 482 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ రద్దు కుదరదని ముకుల్ వాదించారు. అవినీతికి 17ఏ సెక్షన్‌కు సంబంధం లేదని అన్నారు. విధాన పరమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవడానికి అధికారులు వెనకాడగూడదనే ఉద్దేశ్యంతో 17ఏ ద్వారా రక్షణ కలిపించారని రోహత్గీ తెలిపారు. అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుంది..? అంటూ ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అవినీతి కేసులో 17 ఏ చంద్రబాబు‌కు వర్తించినా మిగతా సెక్షన్స్‌లో వర్తించదని ముకుల్ వాదించారు. నేరం ముందు జరిగి ఉండొచ్చు కానీ, విచారణ జరిపే సమయానికి 17ఏ వచ్చింది కదా, అందువల్ల దానికింద ఉన్న ఆంక్షలు వర్తించొచ్చని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు. ఇంకా వాదనలు సాగుతున్నాయి.

mukul-rohatgi.jpg

Updated Date - 2023-10-17T16:46:10+05:30 IST