TS Congress : ఫ్యామిలీలో రాజకీయ రచ్చ జరుగుతుండగా.. డీఎస్ ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్స్..
ABN , First Publish Date - 2023-03-27T19:42:39+05:30 IST
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు...
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) రావడంతో పక్షవాతం కూడా సోకింది. ఆదివారం రాత్రి ఆయనకు ఫిట్స్ రావడంతో మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను భాగ్యనగరంలోని సిటీ న్యూరో సెంటర్‌కు (Citi Neuro Centre Hospital ) తరలించారు. డీఎస్‌కు చికిత్స అందించిన ప్రత్యేక వైద్య బృందం.. ఆయన హెల్త్‌పై బులెటిన్‌ను విడుదల చేసింది.
డాక్టర్లు ఏం చెప్పారంటే..!
‘డీఎస్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రాజకీయాలకు, మీడియాకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి’ అని సిటీ న్యూరో న్యూరాలిజిస్ట్ చంద్రశేఖర్ రెడ్డి బులెటిన్‌లో తెలిపారు. డీఎస్ ఫ్యామిలీలో రాజకీయ రచ్చ జరుగుతుండగానే డాక్టర్లు హెల్త్ బులెటిన్ ఈ షాకింగ్ విషయాలు చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు డీఎస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, అనుచరులు కోరుకుంటున్నారు.
ఆదివారం రాత్రి ఏం జరిగిందంటే..!
కాంగ్రెస్‌లో చేరిన 24 గంటల వ్యవధిలోనే పార్టీకి డీఎస్ రాజీనామా చేసేశారు. తనకు ఆరోగ్యం సహకరించట్లేదని.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. డీఎస్ ఆరోగ్యంపై సతీమణి విజయలక్ష్మి కూడా ఆందోళన చెందుతున్నారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. ఆయన్ను పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయన్ను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకు చేతులు జోడించి దండం పెడుతున్నా.. ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ప్రశాంతంగా బతకనీయండి’ అని కాంగ్రెస్ అధిష్ఠానానికి డీఎస్ సతీమణి లేఖ రాశారు.