TS Congress : కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నెలరోజులకే పొంగులేటికి కీలక పదవి..

ABN , First Publish Date - 2023-07-14T23:01:22+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇందుకు ఎలాంటి చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుని ముందుకెళ్తోంది...

TS Congress : కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న నెలరోజులకే పొంగులేటికి కీలక పదవి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ను (CM KCR) ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఇందుకు ఎలాంటి చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుని ముందుకెళ్తోంది. ఈ క్రమంలో హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను టీపీసీసీ ప్రచార కమిటీని నియమిస్తూ శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. దీంతో పొంగులేటి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. 37 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ.. ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతలకు కూడా చోటు దక్కింది.


Ponguleti.jpg

ప్రచార కమిటీ ఇలా..

  • ప్రచార కమిటి చైర్మన్‌గా మధు యాష్కీ

  • కో చైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy)

  • ప్రచార కమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్‌ను పదవి వరించింది.

Ponguleti-Speech.jpg

నెలరోజులకే కీలక పదవి

కాగా.. బీఆర్ఎస్‌పై తిరుగుబావుటా ఎగరేయడంతో హైకమాండ్.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పొంగులేటి.. ఖమ్మం వేదికగా ‘జనగర్జన’ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన తర్వాత స్పీడ్ పెంచిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ షరతు మేరకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే.. పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటిని కీలక పదవే వరించింది. ప్రచార కమిటీ కో-చైర్మన్‌గా నియమిస్తూ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీకి చెందిన ముఖ్యులు, అనుచరులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.


ఇవి కూడా చదవండి


TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


Updated Date - 2023-07-14T23:08:01+05:30 IST