Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2023-07-14T20:45:20+05:30 IST

అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..

Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్

అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది.


Pawan.jpg

ఇదీ అసలు కథ..!

పవన్ కల్యాణ్ ‘వారాహి’ విజయ యాత్ర (Varahi Vijaya Yatra) రెండో విడత శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే.. జనసేన నేత విడివాడ రామచంద్రరావుకు (Vidivada Ramachandra Rao) క్షమాపణలు చెప్పారు. క్షమాపణలతో సభ ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే విడివాడ రామచంద్రరావుగారికి. ఆయన ఎంత బలమైన నాయకుడు అంటే నిన్న వీర మహిళలు, జనసేన కార్యకర్తల సభలో చెబితే నాకు సరిపోలేదు. అందుకే తణుకులో పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడి వెంట గత ఎన్నికల సమయంలో నేను నిలబడలేనందుకు మనస్పూర్తిగా చింతిస్తున్నాను. నేను టికెట్ ఇచ్చిన వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోయారు. సీటు ఇవ్వని రామచంద్రరావు గారు పార్టీ కోసమే నిలబడ్డారు. ఇలాంటి వ్యక్తికి ధన్యవాదాలు చెబుతూ అందరి ముందు క్షమాపణలు కోరుతున్నాను అని క్షమాపణలతోనే సభను ప్రారంభించారు పవన్. ఈ సందర్భంగా మరోసారి జగన్ సర్కార్‌పై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలతో సేనాని విరుచుకుపడ్డారు.

Vidivada-Ramachandra-Rao.jpg

ఏమంటానో నాకే తెలీదు..!

‘జగన్ (YS Jagan) రాజకీయ అవినీతిపై జనసేన పోరాటం చేస్తున్నది. జగన్ లంచగొండితనం మీద పోరాటం చేస్తున్నాను. స్థానిక మంత్రి కారుమూరి రైతులపై ఎలా విరుచుకుపడ్డాడో అందరికి తెలుసు. మద్దతు ధర కోసం పోరాడుతున్న దువ్వకి చెందిన 24 మంది రైతులపై కేసులు పెట్టావు. పోలవరం ఎలాగూ కట్టలేవు.. ఎర్రకాల్వ మరమ్మతుల కోసం రూ. 30 కోట్లు ఖర్చు చెయ్యి చాలు. కేంద్రం ఇచ్చిన రూ. 1100 కోట్ల విపత్తు నిధులను ఇతర పద్దులకు మళ్లించావు. సుప్రీంకోర్టు బయటపెడితేనే ఆ విషయం బయటపడింది. నువ్వు.. ప్రజల డబ్బు దొంగతనం చేస్తున్నావు.. అందుకే జగ్గూ భాయ్ అంటున్నాను. నీకు గళ్ల లుంగీ, పచ్చ చొక్కా వెయ్యాలి జగన్. గతంలో ఉన్న పథకాలకు పేర్లు మార్చి వాటిని అమలుచేస్తున్నావు. ఇంత నాటగాడివి.. ఎందుకు నవరత్నాలు పెట్టావు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు తీసేసావు. కాగ్ ఆ విషయం అడిగితే.. సాంకేతిక తప్పిందం అన్నాడు. పీఎఫ్ దోచేసి, వారిని నిలువునా మోసం చేసావు. జగన్ అనుచరులు ఆయనను జగ్గూ భాయ్ అంటుంటే బాధపడిపోతున్నారు. నన్ను దత్తపుత్రుడుని, ప్యాకేజీ స్టార్ అని, పవన్ అని జగన్ అంటున్నాడు. అందుకే ఆయన్ను జగ్గూ భాయ్ అంటున్నాను. గిట్టుబాటు ధర రాలేదనే రైతులను ఎర్రిపప్ప అని వైసీపీ నాయకులు అంటున్నారు. మీరు ఏమైనా అనొచ్చు.. మేము అంటే తప్పా..? జగన్ గారు నుంచి జగ్గూ భాయ్ అనే స్థితికి జగన్ వచ్చాడు. ఇంకా నా మీద నోరు జారితే జగ్గూ అంటాను.. ఇంకా నోరు జారితే జగన్‌ను ఏమంటానో నాకు తెలీదు. మొలకలు వచ్చాయన్న రైతులనుఇక్కడ మంత్రి ఎర్రిపప్ప అంటాడు. ఎర్రిపప్ఫ అంటే అర్ధం ఏమిటంటే బుజ్జి కన్నా అంటాడు. జగన్ జే ట్యాక్స్ వేస్తే.. తాడేపల్లిగూడెంలో ‘కే’ ట్యాక్స్.. తణుకులో ఎర్రిపప్ప ట్యాక్స్ వేస్తున్నారు. తాడేపల్లిలో ఒక బూతుల విశ్వవిద్యాలయం ఉంది. వారు చెప్పినట్లు వైసీపీ నాయకులు మాట్లాడితే, చూస్తూ ఊరుకోనుఅని మంత్రిని, ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పవన్ మాట్లాడారు.

jagan1.jpg


ఇవి కూడా చదవండి


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?


TS Politics : హిమాన్ష్ సూచన తప్పకుండా తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Revanth Vs KCR : తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ నడుస్తుండగా.. షాకింగ్ సర్వే అంటూ సడన్‌గా బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి


Updated Date - 2023-07-14T20:49:47+05:30 IST