Janasena Party: సీఎం జగన్ వ్యాఖ్యలకు జనసేన కౌంటర్.. మీకు ఆ దమ్ము కూడా లేదుగా..!!
ABN , Publish Date - Dec 14 , 2023 | 07:29 PM
Janasena Party: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ గురువారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ చేసింది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయని జనసేన పార్టీ ఎద్దేవా చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ గురువారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాసలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ చేసింది. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయని జనసేన పార్టీ ఎద్దేవా చేసింది. సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో జగన్‌ను మించిన సీబీఐ దత్తపుత్రుడు లేడని తన ట్వీట్‌లో తెలిపింది. 2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా అంటూ జగన్‌ను ప్రశ్నించింది. ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ.. తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్‌కు, వైసీపీకి లేదని ఆయనే చెప్పుకున్నట్లు ఉందని జనసేన పార్టీ విమర్శలు చేసింది.
కాగా పలాస సభలో సీఎం జగన్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడటం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు కనీసం స్వతంత్ర అభ్యర్థిగాపోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలను వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పవన్‌ను విమర్శిస్తుండగా.. తాజాగా ఈ అంశంపై జనసేన పార్టీ స్పందించడంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు తెల్లముఖాలు వేస్తున్నారు.