BRS First List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందు కీలక పరిణామం.. నరాలు తెగే ఉత్కంఠ!
ABN , First Publish Date - 2023-08-21T12:09:45+05:30 IST
ఒకరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు (BRS Sitting MLAs).. సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో (Kavitha) భేటీ అయ్యారు. టికెట్ రాదని తేలిపోవడంతో ఎలాగైనా సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇప్పిస్తే గెలుచుకొని వస్తామని కవితకు విన్నవించుకుంటున్నారు..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు (BRS Sitting MLAs).. సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో (Kavitha) భేటీ అయ్యారు. టికెట్ రాదని తేలిపోవడంతో ఎలాగైనా సరే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇప్పిస్తే గెలుచుకొని వస్తామని కవితకు విన్నవించుకుంటున్నారు. మరోవైపు.. ఆశావహులు కూడా అటు కవితతో.. ఇటు మంత్రి హరీష్ రావులతో (Minister Harish Rao) వరుస భేటీలు అవుతున్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. అమెరికా టూర్‌లో బిజిబిజీగా ఉండటంతో ఇక కవిత ఇంటికి సిట్టింగులు క్యూ కట్టారు. ఎలాగైనా సరే టికెట్లు వచ్చేలా చూడండి మేడమ్.. చూడండి సార్ అంటూ కవిత, హరీష్‌లను బతిమాలుతున్నారట. ఇంకొందరేమో ‘మాకు టికెట్ ఇప్పించే భరోసా మీదే మేడమ్.. పెద్ద సార్ (కేసీఆర్)కు మీరే చెప్పాలి మేడమ్’ అని రెక్వెస్ట్ చేస్తున్నారు. ఆదివారం నుంచి ఇదే పరిస్థితి. ఇలా పదుల సంఖ్యలో సిట్టింగులు, ఆశావహులు కవితతో వరుస భేటీలు అయ్యారు. నేతలందరి వినతులు విన్నాక తన ఇంటి నుంచి ప్రగతి భవన్‌కు కవిత బయల్దేరి వెళ్లారు.
భాపూ ఏం చేద్దాం..?
ప్రగతి భవన్‌లో మరికొన్ని నిమిషాల్లో కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోయింది. అటు ఎమ్మెల్యేల అభిమానులు, కార్యకర్తలు, అనుచరుల్లో సైతం నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా ప్రకటనకు ముందు.. సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ కాబోతున్నారు. నిన్నటి నుంచి తనకు వచ్చిన విన్నపాలను కేసీఆర్ ముందు ఉంచబోతున్నారు. ‘మరోసారి క్రాస్ చెక్ చేయండి.. బాపూ’ అని కవిత కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒకరిద్దరికి (మహిళా ఎమ్మెల్యే, ఓ కీలకనేత) కవిత టికెట్ హామీ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. ఫస్ట్ లిస్టులో తప్పకుండా తమ పేర్లు ఉంటాయని ఆ ఇద్దరూ ప్రగతి భవన్ బయటే వేయి కళ్లతో వేచి చూస్తున్నారట.
ఎవరెవరు కవితను కలిశారు..?
నిన్న, ఇవాళ కవితను రేఖా నాయక్, సునీతా లక్ష్మారెడ్డి, ముత్తిరెడ్డి, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రత్నంతో పాటు పలువురు సిట్టింగులు, ఆశావహులు చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఆదివారం రోజు ప్రత్యేకంగా వెళ్లి కవితను కలిసిన బొంతు రామ్మోహన్ ఇవాళ మరోసారి భేటీ అయ్యారు. ఈయన ఉప్పల్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్ రెడ్డి కూడా కవితతో భేటీ అయ్యారు. అయితే ఈ ఇద్దరికీ కాకుండా మరో కీలక నేతకు టికెట్ ఇచ్చేసినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఉద్యమ కారులకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇల్లందు, సంగారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నేతలు హరీష్ రావును కలిశారు.