Home » Pragathi Bhavan
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయిన పలు అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ(శనివారం) సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా, లేదా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈనెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. ఎన్డీయే కూటమిలో చంద్రబాబు (CM Chandrababu) కీలకమైన వ్యక్తిగా మారారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు.
దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని తెలియడంతో ప్రగతి భవన్‌ను చూసేందుకు కామన్ పబ్లిక్ వస్తున్నారు. మెదక్ జిల్లా శంకరం పేట నుంచి సుభాష్ రెడ్డి వచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న నేతలను సీఎం కేసీఆర్(CM KCR) ఏదో ఒక హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నారు.
అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!..
పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు..
బీఆర్ఎస్ (BRS) సిట్టింగులు, ఆశావహులు ఎంతగానో వేచి చూస్తున్న తొలి అభ్యర్థులకు (BRS First List) సమయం ఆసన్నమైంది. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు..
అవును.. అదిగో ఇదిగో బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) వచ్చేస్తోంది.. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది.. నేడే విడుదల.. అని ప్రగతి భవన్లో (Pragathi Bhavan) జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. మరోవైపు.. సరిగ్గా 12.03 నుంచి 12:50 నిమిషాల మధ్యలో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు (BRS) చెప్పుకున్నప్పటికీ ఇంతవరకూ చలీచప్పుడు లేదు..