YCP: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు షాకిచ్చిన కోటంరెడ్డి.. !

ABN , First Publish Date - 2023-03-03T23:13:24+05:30 IST

నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు (YCP MLA Anil Kumar Yadav) నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP rebel MLA Kotamreddy) Sridhar Reddy) షాక్ ఇచ్చారు.

YCP: వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కు షాకిచ్చిన కోటంరెడ్డి.. !

నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు (YCP MLA Anil Kumar Yadav) నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP rebel MLA Kotamreddy) Sridhar Reddy) షాక్ ఇచ్చారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కపాడిపాళెంలో కోటంరెడ్డికి దళితులు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. దీంతో కోటంరెడ్డి మొదటిసారి నెల్లూరు సిటీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. గతంలో ఎప్పుడూ కోటంరెడ్డి సిటీ నియోజకవర్గంలో తలదూర్చలేదు. ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో అనిల్ అనుచరులు, వైసీపీ శ్రేణులు అయోమయానికి గురయ్యారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అనిల్‌కు నష్టం తప్పదని చర్చ జరుగుతోంది.

ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( YCP REBEL MLA Kotamreddy Sridhar Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను మళ్లీ వైసీపీ నుంచి పోటీచేయడంలేదని స్పష్టం చేశారు. తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో ముందుకెళ్తానన్నారు. నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి (Adala Prabhakara Reddy)అని చెబుతున్నారని, ఆదాల ఏ పార్టీలో ఉంటున్నారో స్పష్టత ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా అన్ని పార్టీలకు ఆదాల తిరగొద్దని సూచించారు.

వేల కోట్ల ఆస్తులున్న ప్రభాకర్ రెడ్డితో ఢీ కొనడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీదారుగానే భావిస్తానని కోటంరెడ్డి అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping)పై హోంశాఖకు ఫిర్యాదు చేసినట్టేనన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) కూడా విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు (11 Corporators) తనవెంట ఉన్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ వైపు వెళ్లిన వారు.. రాజకీయంగానే కాదని.. మానసికంగా కూడా తనకు దగ్గరగా ఉన్నారన్నారు. ఆరు నెలల తరువాత చిత్ర విచిత్రాలు ఎన్నో చూస్తారన్నారు.

Updated Date - 2023-03-03T23:46:01+05:30 IST