MyHero CBN: విశ్వవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు.. ట్రెండింగ్‌లో #MyHeroCBN

ABN , First Publish Date - 2023-09-19T18:11:56+05:30 IST

చంద్రబాబు కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా నిరసనలు చేపడుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #MyHeroCBN అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

MyHero CBN: విశ్వవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు.. ట్రెండింగ్‌లో #MyHeroCBN

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యా్న్స్ కూడా నిరసనలు చేపడుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో #MyHeroCBN అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. విదేశాల్లో పని చేస్తున్న తెలుగు ప్రజల్లో చాలా మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే.. చంద్రబాబు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. అమెరికాలోని డాలస్, కనెక్టికట్, వాషింగ్టన్ డీసీతో పాటు బెల్జియం, ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా దేశాల్లోని టీడీపీ ఎన్నారై శాఖల సభ్యులు, అభిమానులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. ‘ఎన్నారై విత్ సీబీఎన్’, ‘సేవ్ డెమొక్రసీ’, ‘సేవ్ ఏపీ’ పేరుతో నినాదాలు చేశారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నారై బ్రిస్బేన్‌ టీడీపీ సభ్యులు చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజల్లోకి వెళ్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు వస్తున్న మద్దతును చూసి సీఎం జగన్‌ బెంబేలెత్తిపోతున్నారన్నారు. అందుకే ఆయన్ను కుట్రపూరితంగా అరెస్టు చేశారని విమర్శించారు. దుబాయ్‌లో కూడా ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. టీడీపీ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో పార్టీ అధినేతకు మద్దతుగా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం Jebel Ali Hindu Temple ప్రాంగణంలో జరిగింది. ఎన్నారై తెలుగుదేశం దుబాయ్ సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరులు దీక్షలో పాల్గొన్నారు. సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: CBN Arrest : వినాయక చవితి రోజున టీడీపీ ఆసక్తికర ట్వీట్.. ఎక్కడ చూసినా ఇదే చర్చ

మరోవైపు కన్వల్ రేఖి అనే ఇండియన్ అమెరికన్ పారిశ్రామికవేత్త కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు ఎంత దార్శనికతతో ఉంటారో ఎలా కష్టపడతారో ఆ పోస్టులో వివరించారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఓ ఆఫీసును హైదరాబాద్‌లో ప్రారంభింపచేయడానికి చంద్రబాబు ఎలా కష్టపడ్డారో పేర్కొన్నారు. ఇలాంటి నేతలు దేశానికి ఎంతో అవసరమన్నారు. అటు చంద్రబాబుతో నేరుగా పరిచయడం ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు టీడీపీ అధినేత పనితీరును సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వీరి స్పందన ద్వారా తెలుస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.

my hero cbn.jpg

Updated Date - 2023-09-19T18:37:44+05:30 IST