Ongole YSRCP: బావాబావమరుదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు..వైసీపీలో తీవ్ర చర్చ..

ABN , First Publish Date - 2023-02-13T11:57:23+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తోడళ్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డి.. ఆయన హయాంలో

Ongole YSRCP: బావాబావమరుదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు..వైసీపీలో తీవ్ర చర్చ..

జగన్ పార్టీలో ఆయన కీలక నేత. కానీ.. గత ఎన్నికల్లో ఆయనకు అధినేత హ్యాండిచ్చారు. జగన్‌కు సొంత బంధువైనా.. సిట్టింగ్ ఎంపీ సీటు దక్కకుండా పోయింది. అయితే.. గత ఎన్నికల్లో మిస్సైన ఆ సీటు కోసం.. ఆయన మళ్లీ పావులు కదుపుతున్నారు. నాలుగేళ్లుగా పార్లమెంట్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ఆయన.. ప్రస్తుతం.. పార్టీ మీటింగులు నిర్వహిస్తూ.. ప్రచారం చేసేస్తున్నారు. ఇంతకీ.. ఎవరా వైసీపీ కీలక నేత?.. జగన్‌కు బంధువైనా సిట్టింగ్‌ సీటు ఎందుకు మిస్‌ అయింది?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-402.jpg

వైసీపీ కీలక నేతల్లో ఆయనా ఒకరు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తోడళ్లుడు అయిన వైవీ సుబ్బారెడ్డి.. ఆయన హయాంలో కాంగ్రెస్‌లో తెరవెనుక చక్రం తిప్పారు. వైఎస్ మరణాంతరం జగన్‌కు వైవీ సుబ్బారెడ్డి వెన్నంటే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ కీలక నేతల్లో ఆయనా ఒకరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందిన వైవీ సుబ్బారెడ్డి.. 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే.. ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి బావ బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమిపాలయ్యారు. ఒంగోలు అసెంబ్లీ స్థానంలో అప్పటికే వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన బాలినేని.. 2014లో ఓటమిపాలు కావడంతో దానికి వైవీ సుబ్బారెడ్డే కారణమని ఫీలైపోయారు. దాంతో అప్పటినుండి బావాబావమరుదుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

Untitled-654.jpg

ఒంగోలు పార్లమెంట్ వైసీపీ టిక్కెట్ కోసం పావులు

ఇదిలావుంటే.. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సిట్టింగ్ సీటు వైవీ సుబ్బారెడ్డికి దక్కకకుండా పోయింది. ఆ ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి జగన్‌ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే.. వైవీ సుబ్బారెడ్డి సిట్టింగ్ సీటు కోల్పోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని అప్పట్లో ఆయన వర్గం రగిలిపోయింది. సిట్టింగ్ సీటు దక్కకపోవడంతో ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్‌లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకోవడం తగ్గించారు. కానీ.. ఆయనకు రెండు సార్లు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి జగన్‌ బుజ్జగించారు. వైవీ సుబ్బారెడ్డి మాత్రం ప్రకాశం జిల్లాలో రాజకీయంగా మరోసారి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దానికి తగ్గట్లే.. ఇటీవల ఒంగోలు పార్లమెంట్ వైసీపీ టిక్కెట్ కోసం పావులు కదుపుతున్నట్లు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Untitled-52558.jpg

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి

వాస్తవానికి... ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో అమిత్ అరోరాకి 100 కోట్లు ముడుపులు ఇచ్చిన కేసులో మాగుంటతోపాటూ.. ఆయన కొడుకు రాఘవరెడ్డిపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాంతో.. మాగుంట ఒంగోలు పాలిటిక్స్‌ను పక్కనపెట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి బయట పడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకోవడంతో శ్రీనివాసులురెడ్డి.. వైసీపీలోనూ.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారారు. ఇక.. గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోయిన వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం మాగుంట ఇష్యూని అవకాశంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది.

Untitled-77.jpg

ఒంగోలు ఎంపీ టిక్కెట్ తిరిగి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని వైసీపీలో టాక్ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడంతో నిన్నమొన్నటి వరకు ఒంగోలు వైపు కన్నెత్తి కూడా చూడని సుబ్బారెడ్డి ఇటీవల తరచూ జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించి మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్నారు. దాంతో.. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ కోసం వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సిట్టింగ్‌ ఎంపీ సీటును కోల్పోయిన వైవీ సుబ్బారెడ్డి..

మొత్తంగా.. ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ కీలక నేతలు టిక్కెట్ల ప్రయత్నాల్లో వేగం పెంచుతున్నారు. ప్రధానంగా.. గత ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ సీటును కోల్పోయిన వైవీ సుబ్బారెడ్డి.. తిరిగి సొంతం చేసుకునేందుకు గట్టిగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఎపిసోడ్‌ తర్వాత ఒంగోలులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏదేమైనా.. ఎంపీ సీటు దక్కించుకునే విషయంలో వైవీ సుబ్బారెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Untitled-854.jpg

Updated Date - 2023-02-13T12:23:59+05:30 IST