Viveka Murder Case : ఎంపీ అవినాష్ ఫోన్ కాల్ రికార్డ్‌పై పెదవి విప్పిన సజ్జల.. ఇలా అనేశారేంటి..?

ABN , First Publish Date - 2023-02-03T21:34:40+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డు ..

Viveka Murder Case : ఎంపీ అవినాష్ ఫోన్ కాల్ రికార్డ్‌పై పెదవి విప్పిన సజ్జల.. ఇలా అనేశారేంటి..?

అమరావతి/కడప : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డు (Phone Call Record) సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ‘అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏముంది?. నవీన్‌ అనే వ్యక్తి సీఎం వైఎస్ జగన్‌ (CM Jagan) ఇంట్లో అటెండర్‌. కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ ఆరోజు.. ఈరోజు కూడా జగన్‌ దగ్గరే ఉన్నారు. ఇందులో అసహజం ఏముంది?. వివేకా హత్యను జగన్‌కు లింక్‌ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. వివేకా చనిపోయిన విషయం అవినాష్‌రెడ్డికి (MP Avinash Reddy) తెలిసింది. జగన్‌కు చెప్పడానికే నవీన్, కృష్ణమోహన్‌కి అవినాష్‌ ఫోన్ చేసి ఉండొచ్చు. సమాచారం ఇవ్వడాన్ని ఎందుకు తప్పుబడుతున్నారు. సమాచారం ఇచ్చేందుకు సిబ్బందికి ఫోన్‌ చేయడం సాధారణమే. మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) ఫోన్‌ చేయాలన్నా.. ఎవరో ఒకరికి ఫోన్‌ చేయాల్సిందే కదా. అవినాష్‌ రెడ్డి తర్వాత నవీన్‌కు నోటీసులిస్తే.. నవీన్‌ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సజ్జల చెప్పుకొచ్చారు.

YS-Jagan-PA.jpg

ఇదిలా ఉంటే..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సీఎం జగన్ (CM Jagan), ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ (CBI) ప్రశ్నించింది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా శుక్రవారం రోజున దర్యాప్తు జరిగింది. ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగా కృష్ణమోహన్‌రెడ్డిని సీబీఐ బృందం ప్రశ్నించింది. ఆయన తర్వాత వైఎస్ భారతి (YS Bharathi) పీఏ నవీన్ కూడా విచారణకు హాజరయ్యాడు. కాల్ డేటాపై పూర్తిస్థాయిలో సీబీఐ దర్యాప్తు చేయగా కీలక సమాచారం రాబట్టినట్లు తెలియవచ్చింది.

అవినాశ్‌ను ఇలా..!

సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ (CBI SP Ram Singh) నేతృత్వంలోని బృందం ఇదివరకే సుమారు నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించింది. అధికారులు పదుల సంఖ్యలో అడిగిన ప్రశ్నల్లో చాలా వరకు ఆయన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో ఆధారాల ట్యాంపరింగ్‌, సాక్ష్యాల విధ్వంసంపైనే సీబీఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కేసు నమోదు తర్వాత సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో లభించిన ఆధారాలు, అంతకుముందే ‘సిట్‌’ పోలీసులు జరిపిన దర్యాప్తు ప్రాతిపదికన ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించుకున్నారు.

Updated Date - 2023-02-03T21:54:28+05:30 IST