NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?
ABN , First Publish Date - 2023-09-11T15:44:03+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తరఫున ఏసీబీ కోర్టులో (ACB Court) రెండు పిటిషన్లు దాఖలయ్యాయి...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తరఫున ఏసీబీ కోర్టులో (ACB Court) రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి.. హౌస్ కస్టడీ, మరొకటి బెయిల్ పిటిషన్. మొదట కస్టడీకి సంబంధించి విచారణ ప్రారంభమైంది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy).. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddartha Luthra) వాదనలు వినిపిస్తున్నారు. హౌస్ కస్టడీ (House Custody) ఇవ్వాలని లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఆరోగ్యం, భద్రత దృష్టిలోకి తీసుకోవాలని లూథ్రా పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పులను లూథ్రా ఉదహరిస్తున్నారు. పరిణామాలను బట్టి హైకోర్టు వెళ్లే యోచనలో లూథ్రా టీమ్ ఉంది. మరోవైపు.. హౌస్ కస్టడీ పిటిషన్ తర్వాత బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌ను టీడీపీ నేతలు కోర్టులో వేశారు.
ఇదిలా ఉంటే..
చంద్రబాబు హౌస్ అరెస్ట్‌ను సీఐడీ (CID) వ్యతిరేకిస్తోంది. ‘చంద్రబాబు పూర్తి ఆరోగ్యం, పూర్తి భద్రత మధ్య ఉన్నారు. సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ అనేదే లేదు. హౌస్ రిమాండ్‌తో పోల్చితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే భద్రత ఎక్కువ. అక్కడే చంద్రబాబు రక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజమండ్రి జైలు చుట్టూ ప్రహరీతో చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక పిటిషనర్ ఆరోగ్యం కోసం 24X7 వైద్యులు అక్కడే ఉంచారు. అయన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వైద్యులు వహిస్తారు. అందుకే పిటిషనర్‌కు ఇల్లు కన్నా జైలే సేఫ్’ అని పొన్నవోలు కోర్టుకు వివరించారు. తన వాదనలకు కొనసాగింపుగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదన వినిపిస్తారని పొన్నవోలు కోర్టుకు తెలిపారు. అనంతరం సుబ్రమణ్యం వాదనలు ప్రారంభించారు. ప్రస్తుతం లూథ్రా వాదనలు కొనసాగుతున్నాయి.
మొత్తానికి చూస్తే.. ఏసీబీ కోర్టు తీర్పుపై మరోసారి టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కోర్టు బయట భారీగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఉండగా.. అంతకుమించి జనాలు టీవీలకు అతుక్కుపోయి తీర్పును చూస్తున్నారు.