Share News

Chandra Babu Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-12-08T16:43:48+05:30 IST

Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.

Chandra Babu Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చేటట్లు అయితే వాయిదా వేయాలని లేదా విచారణ తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. నోటీసులు జారీ చేసినా ఇంకా కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది రంజిత్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు.

తాము కౌంటర్‌ దాఖలు చేయడానికి సిద్దంగానే ఉన్నామని.. కానీ 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. దీంతో సాల్వే వాదనతో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం ఏకీభవించింది. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. విచారణకు ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని సాల్వే కోరగా.. ఆయన విజ్ఞప్తితో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌ను జనవరి 19కి వాయిదా వేసింది. ఈ లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు, దానికి రిజాయిండర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


మరిన్ని ఏపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-08T16:43:49+05:30 IST