Share News

Big Breaking : చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2023-10-20T11:16:10+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది..

Big Breaking : చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ జరిపింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న తర్వాత విచారణ నవంబర్-08కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే చంద్రబాబు న్యాయవాదుల విజ్ఞప్తితో నవంబర్-9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం పేర్కొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై తీర్పు వెల్లడించిన తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

అరెస్ట్ చేయకండి!

అయితే.. అప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. మరోవైపు ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడానికి మాత్రం వీల్లేదని సీఐడీ, ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా సుప్రీం నిర్ణయంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట దక్కినట్లయ్యింది. సుప్రీంకోర్టు జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం. త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది.


కాగా.. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం కేసులో గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయరాదని ఆయన తరపు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా పేర్కొన్న దృష్ట్యా.. ఫైబర్ నెట్ కేసులో కూడా ఇదే వర్తిస్తుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అయితే.. నవంబర్-08న సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-10-20T13:59:20+05:30 IST