TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!

ABN , First Publish Date - 2023-02-18T20:06:19+05:30 IST

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition) ఇంకా అత్యంత విషమంగానే ఉంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో (Narayana Hrudayalaya) తారకరత్న చికిత్స పొందుతున్నారు.

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి (Health Condition) ఇంకా అత్యంత విషమంగానే ఉంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో (Narayana Hrudayalaya) తారకరత్న చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు చికిత్స అందుతోంది. విదేశీ వైద్యులు వచ్చినా తారకరత్న పరిస్థితి మెరుగుపడలేదని భావిస్తున్న నారాయణ హృదయాలయ వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యానికి తారకరత్న సహకరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా.. తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినట్లు సమాచారం.

Kollu-Ravindra-1.jpg

హుటాహుటిన బెంగళూరుకు..!

తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ ముఖ్యనేత కొల్లు రవీంద్ర.. (Kollu Ravindra) ఇవాళ తన ప్రోగ్రామ్స్ అన్నీ వాయిదా వేసుకుని హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన నేరుగా ఐసీయూలోకి వెళ్లి (ICU) తారకరత్నను పరామర్శించారు. అనంతరం వైద్యులు, బాలయ్యతో (Balayya) మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తన ఫేస్‌బుక్ (Facebook) ఖాతా ద్వారా కొల్లు తెలియజేశారు. ‘గత కొన్ని రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న గారిని పరామర్శించాను. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లును అడిగి తెలుసుకున్నాను. ఆ సమయంలో అక్కడకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారితో కాసేపు చర్చించడం జరిగింది’ అని ఫేస్‌‌బుక్‌లో కొల్లు రవీంద్ర రాసుకొచ్చారు. దీంతో పాటు ఆస్పత్రిలో ఉన్న రెండు ఫొటోలను కూడా జతచేశారాయన.

Kollu-Ravindra-2.jpg

ఆందోళన..!

వాస్తవానికి ఇవాళ 4.30 గంటలకే హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు రిలీజ్ చేయాల్సి ఉన్నా.. ఇంతవరకూ ఆ ఊసే లేదు. అయితే తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తారకరత్నను తరలించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హైదరాబాద్‌కు తరలించి ఎక్కడ చికిత్స అందిస్తారు..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉందని అటు వైద్యులు చెబుతుండటం.. ఇటు హైదరాబాద్‌కు తరలిస్తారని వార్తలు వస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.

Kollu-Ravindra.jpg

ఇవి కూడా చదవండి..

TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న వైద్యులు.. రేపు మధ్యాహ్నం తర్వాత...!!


తారకరత్నకు సంబంధించి మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Updated Date - 2023-02-18T20:23:42+05:30 IST