YuvaGalam Padayatra : నారా లోకేష్ ఇంతలా స్లిమ్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా.. ఫస్ట్ టైమ్ పెదవి విప్పిన యువనేత..
ABN , First Publish Date - 2023-02-24T19:37:43+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నాటికి.. నేటికీ చాలా స్లిమ్‌గా (Slim) తయారయ్యారు. కరోనా తర్వాత నారా లోకేష్ 2.0 గా తయారయ్యారు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నాటికి.. నేటికీ చాలా స్లిమ్‌గా (Slim) తయారయ్యారు. కరోనా తర్వాత నారా లోకేష్ 2.0 గా అయ్యారు. ఆయన్ను చూసిన వీరాభిమానులు (Fans), టీడీపీ కార్యకర్తలు (TDP Activists) ఆశ్చర్యపోయారు. అప్పటి వరకూ లోకేష్ ఆహార్యం గురించి మాట్లాడిన విమర్శకుల నోటికి తాళం పడింది. అవినీతి మరకల్లేని మిస్టర్ క్లీన్ లోకేష్ ఇప్పుడు భాష, రూపంలోనూ పర్‌ఫెక్ట్‌గా మారి మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా (Mr Perfect) ఆకట్టుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ యువనేత (Young Leader) స్పీడు చూసి మంచి జోష్ మీదున్నారు. అయితే అసలు లోకేష్ ఇంతాలా ఎలా మారిపోయారు..? ఏమిటా రహస్యం..? ఇదెలా సాధ్యం..? అని అందరూ అవాక్కయ్యారు. ఇంతవరకూ స్లిమ్ బాడీ గురించి ఎప్పుడూ నోరు మెదపని నారా లోకేష్.. ఫస్ట్ టైమ్ యువగళం (YuvaGalam) పాదయాత్రలో పెదవి విప్పారు. పాదయాత్రలో భాగంగా.. తిరుపతిలో (Tirupati) యువతతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ ముఖాముఖిలో లోకేష్ అసలు విషయం చెప్పేశారు.
ఇదీ అసలు కథ..
కరోనా టైమ్‌లో (Corona Time) హైదరాబాద్‌లో (Hyderabad) ఉన్న నారా లోకేష్.. 2020లో మహానాడులో (Mahanadu) పాల్గొనేందుకు ఏపీకి వచ్చారు. స్లిమ్‌గా కనిపించిన ఆయన్ను చూసి అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ఎంతలా అంటే ఈయన అసలు నారా లోకేషేనా.. మరెవరైనా అనేంతలా. నాటి నుంచి నేటి వరకూ మరింత స్లిమ్‌గా తయారవుతూ వచ్చారు లోకేష్. అయితే ఈయన ఇలా తయారవ్వడానికి కర్త, కర్మ, క్రియ మొత్తం నారా బ్రాహ్మణీనే (Nara Bramhini) అని స్వయానా లోకేష్ చెప్పుకొచ్చారు. ‘2020 లో ముందుకన్నా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండటానికి కారణం బ్రాహ్మణీ. కొవిడ్ దెబ్బకు బ్రాహ్మణీకి రెండు సంవత్సరాలు దొరికిపోయాను’ అని లోకేష్ చెప్పారు. అంతేకాదు 2020 నుంచి ఇప్పటి వరకూ ప్రతిరోజూ తాను ఎప్పుడేం తినాలి..? డైట్ ఎలా ఫాలో అవ్వాలి..? అనేదానిపై బ్రాహ్మణి నిఘాతో ఉంటారన్నారు. చివరగా.. తన సక్సెస్‌కు కారణం బ్రాహ్మణీనే అని కూడా క్లియర్‌గా చెప్పేశారాయన. ఇన్ని రోజులకు అటు అభిమానులు, ఇటు కార్యకర్తల సందేహాలకు పాదయాత్రలో సమాధానమిచ్చేశారు లోకేష్.
అప్పట్లో ఇలా..!
కరోనా తర్వాత.. ఆరు నెలల్లో తాను 20 కేజీల బరువు తగ్గినట్టు అప్పట్లో లోకేశ్ చెప్పారు కానీ ఎలా అనేది మాత్రం చెప్పలేదు. నైక్ ట్రైనింగ్ క్లబ్ మొబైల్ యాప్‌లో (Nike Training Club Mobile App) సూచించిన విధంగా రోజుకు 45 నిమిషాలపాటు వ్యాయామం (Exercise) చేయడంతోపాటు చెన్నైకి చెందిన ఓ డైటీషియన్ సూచనలు పాటించినట్లు యువనేత చెప్పారు. అంతేకాదు.. బరువు తగ్గిన కారణంగా ఉన్న పసుపు చొక్కాలన్నీ లూజైపోయాయని చెప్పారు. లాక్‌డౌన్‌తో కొత్త చొక్కా కుట్టేవాళ్లు లేకపోవడంతో పాత చొక్కాతోనే మహానాడుకు వేసుకొచ్చినట్టు లోకేశ్ అప్పట్లో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.