BRS Candidates List : బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు డేట్, టైమ్, వేదిక ఫిక్స్.. సిట్టింగుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!
ABN , First Publish Date - 2023-08-19T18:07:53+05:30 IST
అవును.. బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు అదిగో.. ఇదిగో అని చెప్పి ప్రతిసారీ వాయిదా వేస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్ర్యత్యర్థులకు ఊహించని రీతిలో ముందు ఉండాలని.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్లానట...
అవును.. బీఆర్ఎస్ తొలి జాబితా (BRS First List) విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పలుమార్లు అదిగో.. ఇదిగో అని చెప్పి ప్రతిసారీ వాయిదా వేస్తూ వస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్ర్యత్యర్థులకు ఊహించని రీతిలో ముందు ఉండాలని.. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి పంపాలన్నది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్లానట. అందుకే ఇక వాయిదా వేసే ప్రసక్తే లేదని గులాబీ బాస్ ఫిక్స్ అయ్యారట. ఇంతకీ ఎప్పుడు ప్రకటన రానుంది..? అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారా..? లేకుంటే కేటీఆర్, హరీష్ రావులు ప్రకటిస్తారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
ఇదీ అసలు కథ..!
తెలంగాణ ఎన్నికలు (Telangana Election) సమీపిస్తున్నాయి. ఇంతకాలం చేరికలు, వ్యూహ-ప్రతివ్యూహాలు, గెలుపు గుర్రాల అన్వేషణలపై కసరత్తులు చేసిన రాజకీయ పక్షాలు (Political parties) ఇకపై వాటిని కదనరంగంలో ప్రదర్శించబోతున్నాయి. గురువారం నుంచి శ్రావణమాసం మొదలైంది. దీంతో ముక్కోణ పోరులో తలపడబోతున్న బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)తోపాటు ఇతర పార్టీలు కూడా ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయబోతున్నాయి. తెలంగాణ ఎన్నికలకు గట్టిగా 3 నెలల సమయం మాత్రమే ఉండడంతో పార్టీలన్నీ ఇక ప్రచారాన్ని ఉదృతం చేయబోతున్నాయి. అభ్యర్థుల అన్వేషణ, ఎంపిక, జాబితాల ప్రకటన కాస్త అటుఇటుగా తేడా ఉండొచ్చేమో కానీ ప్రచారపర్వం మాత్రం ఇక హోరెత్తబోతోంది. ఇందుకు సంబంధించి పార్టీలన్నీ ఇప్పటికే వేర్వేరు కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. గెలుపు గుర్రాలపై దృష్టిసారించిన ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారు చేసే నిమగ్నమయ్యాయి.
ముహూర్తం ఇదే..!
రాజకీయ ఎత్తుగడలు వేయడంలో గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధహస్తుడు. అందుకే ఆయన్ను రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన గులాబీ బాస్.. హ్యాట్రిక్ కొట్టడానికి ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి జూన్ నెలలోనే మొదటి జాబితా ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నప్పటికీ.. ఆ తర్వాత జూలై, ఇప్పుడు ఆగస్టు కూడా సగం నెల పూర్తయ్యింది. ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితులు అనుకూలించట్లేదని ఇక తొలి జాబితా రిలీజ్ చేయాల్సిందేనని కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈ నెల 21న అంటే సోమవారం నాడు స్వయంగా బీఆర్ఎస్ అధినేతే ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సరిగ్గా మధ్యాహ్నం 12:04 నుంచి 12:55 గంటల మధ్యలో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. మొదట.. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మనసు మార్చుకున్న బాస్.. స్వయంగా ప్రకటించాలని ప్లాన్ మార్చారట. తొలి జాబితాలో మొత్తం 80 మంది పేర్లు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది.
మార్పులు, చేర్పులు ఇలా..!
బీఆర్‌ఎస్ ఈసారి 20-25 మంది దాకా సిటింగ్ ఎమ్మెల్యేల(Sitting MLAS)ను మార్చడం ఖాయమని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన విషయం తెలిసిందే. వీరిలో పూర్వ వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడ్డ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య(Station Ghanpur MLA Rajaiah), జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy)లను తప్పించి.. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కడియంకు, పల్లాకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోనూ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతున్నా.. ఉప్పల్ అభ్యర్థి మార్పు మాత్రం ఖాయమేనని తెలుస్తోంది. ఆ స్థానంలో లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని స్వయంగా కే సీఆర్ ఫోన్ చేశారు. అయితే తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు.. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అభ్యర్థుల జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయో.. జాబితాలో పేరు లేని సిట్టింగ్‌లు ఎటువైపు అడుగులేస్తారో తెలియాలంటే ఇంకొక రోజు వేచి చూడాల్సిందే మరి.