Share News

CBN Arrest : రేపు చంద్రబాబుతో ఫ్యామిలీ ములాఖత్.. ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-10-27T18:32:22+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ (CID) అక్రమంగా అరెస్ట్ చేయడంతో 48 రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే...

CBN Arrest : రేపు చంద్రబాబుతో ఫ్యామిలీ ములాఖత్.. ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ (CID) అక్రమంగా అరెస్ట్ చేయడంతో 48 రోజులుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Nara Chandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉంటున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన మొదటి వారం నుంచే చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు (CBN Health) తలెత్తాయి. రోజురోజుకూ అవి తీవ్రం కావడం.. వైద్యులు, జైలు అధికారులు ఇష్టానుసారం హెల్త్ బులెటిన్ (CBN Health Report) రిలీజ్ చేస్తుండటంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు (TDP) ఆందోళన చెందుతున్నాయి. ఇటీవలే బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యులు.. నారా భువనేశ్వరికి (Nara Bhuvaneswari) రిపోర్టు పంపడం మరింత ఆందోళన చెందించే విషయం. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే జైల్లో తన భద్రత, సౌకర్యాలకు సంబంధించి ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తికి చంద్రబాబు సంచలన లేఖ రాయడంతో ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద హాట్ టాపిక్కే అయ్యింది.


Chandra-Babu.jpg

సర్వత్రా ఉత్కంఠ!

చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ములాఖత్ (Mulakat) కాబోతున్నారు. శనివారం నాడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో నారా భువనేశ్వరి, నారా లోకేష్ (Nara Lokesh) భేటీ కాబోతున్నారు. ఇప్పటికే లోకేష్ రాజమండ్రి చేరుకోగా.. తిరుపతి జిల్లాలో ‘నిజం గెలవాలి’ అంటూ బస్సు యాత్ర చేస్తున్న భువనేశ్వరి కొద్దిసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాసిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ములాఖత్‌పై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Bhuvaneswari.jpg

ఏం మాట్లాడుతారో..?

ఇదివరకు చంద్రబాబు ములాఖత్ అయిన ప్రతిసారీ మీడియా మాట్లాడిన కుటుంబ సభ్యులు.. గత రెండు ములాఖత్‌ల నుంచి మీడియా దూరంగా ముభావంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు శనివారం నాటి ములాఖత్ తర్వాత కూడా మీడియాకు దూరంగా ఉంటారు..? మాట్లాడుతారా..? అని టీడీపీ శ్రేణులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ మీడియాతో మాట్లాడితే ఏం చెప్పబోతున్నారు..? చంద్రబాబును స్వయంగా చూసిన తర్వాత ఆయన ఆరోగ్యం, భద్రత గురించి ఏం మాట్లాడతారు..? అనేదానిపై అటు టీడీపీ.. ఇటు వైసీపీలో హైటెన్షనే నెలకొంది.

1cbn-(1).jpg

Updated Date - 2023-10-27T18:35:13+05:30 IST