Congress: కాంగ్రెస్‌లో ఆ ఇద్దరి నేతల తీరు, ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా ఉందట..
ABN , First Publish Date - 2023-03-24T13:24:52+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం. ..ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట... గతం అంత ఘనం అన్నట్లుగా ఒక
అసలే పార్టీ కష్టాల్లో ఉంది. ముందుంది ఎన్నికల కాలం. ఇలాంటి కీలక సమయాల్లో కలిసి ముందుకుసాగాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది ఆ నియోజకవర్గంలో. పార్టీలో ఉన్న ఇద్దరు ముఖ్య నేతల మధ్య విబేధాలు అంతకంతకూ పెరుగుతూనే పోతున్నాయట.. ఇరువురి మధ్య ఉన్న వైరంతో పార్టీకి నష్టం జరుగుతోందని అధిష్టానం...కేడర్ నెత్తి,నోరు కొట్టుకోని ఎంత చెప్పిన లాభం మాత్రం లేదంట. ఇంతకీ గొడవ అంత ఏ నియోజకవర్గంలో.?ఆ ఇద్దరు నేతలు ఎవరు...? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
నారాయణఖేడ్ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గం. ..ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట... గతం అంత ఘనం అన్నట్లుగా ఒక వెలుగు వెలిగింది. ..నియోజకవర్గ పరిధిలో అంత పట్టు ఉన్న ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నారాయణఖేడ్ నియోజక వర్గంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు అసలు తగ్గడం లేదంట..నియోజకవర్గంలో ఉన్నటీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమటుంది అంట..ఇద్దరి నేతల తీరు, ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా ఉందట..నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఒక దగ్గరి కలిసిన కట్టుగా ఉన్న సీన్ ఇప్పటి వరకు ఎక్కడ లేదంట.. వీరి ఇద్దరికి ప్రతిసారి టికెట్ విషయంలోనే గొడవ జరుగుతోందట..నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్స్ పార్టీ తరపున పోటీ చేసింది కూడా ఈ రెండు కుంటుంబాలే. ఈ ఇద్దరు కూడా తండ్రుల వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వారే కావడం గమనార్హం.
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రీపిట్
దివంగత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2016లో అనారోగ్యంతో హఠాన్మరణం చెందడంతో, జరిగిన ఉప ఎన్నికలో వీరి ఇద్దరి మధ్య మొదలయిన గొడవ ఇప్పటివరకు జరుగుతునే ఉందంట.. ఉప ఎన్నికలో కూడా గెలిచే సీటును ఇద్దరి మధ్య నెలకొన్న గోడవలతోనే ఓడిపోయిందట కాంగ్రెస్ పార్టీ..ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రీపిట్ అయ్యిందట. కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ నుంచి సురేష్ షెట్కార్‌కి టికెట్ ఇవ్వడంతో,అలిగి బీజేపీలోకి వెళ్లిపోయారు సంజీవరెడ్డి. 2018 ఎలక్షన్లలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంజీవరెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. ఏళ్లు గడుస్తున్నా ఎన్నికలు వచ్చిపోతున్నా.. కానీ వర్గపోరు ఏ మాత్రం తగ్గకపోగా.. ఇంకా ముదిరిపోయిందట..ఈ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట.. వీరు ఇద్దరు కలిసిమెలిసి ఉంటే అక్కడ అధికార పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు అని, ఇదే విషయం పార్టీ పెద్దలు, కార్యకర్తలు ఈ ఇద్దరి నేతలకు ఎన్నిసార్లు చెప్పిన వీ డోంట్ కేర్ అంటూ..ఇలాగే గొడవలు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారట.
వీరి కోసం చేస్తున్నారా..?పార్టీ కోసం చేస్తున్నారా..?
నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్స్ పార్టీ ఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన దాన్ని కూడా వేర్వేరుగా చేస్తున్నారట నేతలు.. వీరు చేస్తున్న కార్యక్రమాలను చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవి వీరి కోసం చేస్తున్నారా..?పార్టీ కోసం చేస్తున్నారా...? అనే విషయం అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట. కొన్నాళ్ల క్రితం జరిగిన రాహుల్ జోడో యాత్ర లోనూ ఈ ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు..రాహుల్ జోడో యాత్ర సాక్షిగా కూడా వీరి విభేదాలు బయటపడ్డాయట. కాంగ్రెస్ యువరాజు జోడో యాత్రలోనూ పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారట ఇరు వర్గాలు.. ప్రజాసమస్యలపైనా ఇద్దరు నేతలు వేర్వేరుగా నిరసనలు చేస్తుంటారు. పార్టీ సమవేశాలు సైతం విడివిడిగానే నిర్వహించడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ గందరగోళం చేస్తున్నారట. టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం పలుమార్లు
ఇప్పుడు కాంగ్రెస్స్ లో ఆ పరిస్థితి లేదు..
నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇక్కడ 9 సార్లు గెలించింది కాంగ్రెస్ పార్టీ.. అంత మంచి క్యాడర్ ఉన్న పార్టీకి వీరి వల్ల ఎన్నికల్లో అవమానం తప్పడం లేదని అంటున్నారు కార్యకర్తలు.. గతంలో కూడా ఇలాగే జరిగితే, ఈ ఇరు కుంటుబాలను కూర్చోబెట్టి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సముదాయించాడు అని, ఇప్పుడు కాంగ్రెస్స్ లో ఆ పరిస్థితి లేదని..వీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇబ్బందులు తప్పవని అని అంటున్నారు.
మరో వైపు ఈ ఇద్దరి నేతల తీరును చూస్తూ విసిగి వేసారి పోయిన కాంగ్రెస్స్ పార్టీ డై హార్ట్ కార్యకర్తలు మాత్రం,ఇక వీళ్లు మారరు కాక మారరు అని అంటూన్నారట..నారయణఖేడ్ కాంగ్రెస్‌లో ఈ ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వర్గపోరు పై ఇకనైనా కాంగ్రెస్స్ హై కమాండ్ దృష్టి సారిస్తుందా లేదా అనేది వేచి చూడాలి....మరి