YSRCP: సవాళ్లు ప్రతి సవాళ్లతో రెచ్చిపోతున్న ఆ వైసీపీ నేతలు..
ABN , First Publish Date - 2023-03-29T13:20:32+05:30 IST
ఫ్యాక్షన్ గడ్డ పత్తికొండ వైసీపీ నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ సాగుతోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
వచ్చే ఎన్నికల బరిలో నువ్వైనా ఉండు లేదా నేనైనా ఉంటా.. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకూడదని.. ఆ ఇద్దరు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇద్దరు కాదు ఎంతమంది కుట్రలు చేసిన చివరకు మా ఎమ్మెల్యేనే రానున్న ఎన్నికల్లో పోటీలో ఉంటారని సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచర వర్గం సవాల్ చేస్తున్నారట. మరి.. సవాళ్లు ప్రతి సవాళ్లతో రెచ్చిపోతున్న ఆ వైసీపీ నేతలెవరు? ఎక్కడ ఈ పరిస్థితి నెలకొంది. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..
ఎంపీ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే చెక్
ఫ్యాక్షన్ గడ్డ పత్తికొండ వైసీపీ నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వార్ సాగుతోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పత్తికొండపై ఫోకస్ మరింత పెంచారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నుంచి పోటీ చేయాలని ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. నియోజవర్గంలోని ముఖ్య నేతలను ఇప్పటి నుంచే తన వైపుకు తిప్పుకొని.. పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారని.. కురవ సామాజిక వర్గంలో తీవ్ర చర్చ జరుగుతుందట. అయితే ఎంపీ గోరంట్ల మాధవ్‌కు కొద్దిపాటి అవకాశం కూడా రాకుండగా ఎమ్మెల్యే శ్రీదేవి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..రీసెంట్‌గా పత్తికొండకు వచ్చిన గోరంట్ల మాధవ్.. వైసిపి నేత రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు ఇంటికి వెళ్లి.. వాళ్లతో రాజకీయ చర్చలు జరపడం పత్తికొండ వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.
రామచంద్రారెడ్డి కుటుంబం, ఎమ్మెల్యే మధ్య గ్యాప్
పత్తికొండ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవితో కలిసి కెడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ క్రియా శీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రామచంద్రారెడ్డి కుటుంబానికి, ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య కొంత పొలిటికల్ గ్యాప్ వచ్చినట్లు పత్తికొండ వైసీపీలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డితో ఎంపీ గోరంట్ల మాధవ్ కలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం పత్తికొండలోని రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి..,. వచ్చే ఎన్నికల పైన సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో సహకరించాలని ఎంపీ గోరంట్ల రిక్వెస్ట్
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని తన సామాజిక వర్గం వారు తనపై ఒత్తిడి చేస్తున్నారని.. మీరు కూడా సహకరించాలని ఎంపీ గోరంట్ల మాధవ్ రామచంద్రా రెడ్డిని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.అయితే తాము కూడా రానున్న ఎన్నికల్లో పోటీలో ఉండాలని తమ క్యాడర్ పట్టుబడుతోందని రామచంద్రారెడ్డి ఫ్యామిలీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సూత్రప్రాయంగా చెప్పారట. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీలో ఉందాం.. మూడో వ్యక్తి మనకు పోటీ ఉండకూడదని ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గీయులు.. ఇద్దరు ఏకమైనా సీఎం జగన్ ఆశీస్సులు తమ ఎమ్మెల్యేకే మెండుగా ఉన్నాయని.. ఆమెనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీలో ఉండడం ఖాయమని బల్ల గుద్ది చెప్తున్నారట. మొత్తం మీద గోరంట్ల మాధవ్ కోరినట్లు రామచంద్రారెడ్డి కుటుంబం ఆయనకు సహకరిస్తుందా.. అన్నది ప్రశ్నార్థకంగా మారగా... ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ గోరంట్ల మాధవ్ వీరిద్దరిలో ఎవరు రానున్న ఎన్నికల్లో బరిలో ఉంటారని పత్తికొండ వైసీపీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. మరి.. ఈ ముగ్గురిలో జగన్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూడాలి.