Chandra Babu Case: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-10-12T16:49:05+05:30 IST

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది.

 Chandra Babu Case: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

Live News & Update

  • 2023-10-12T17:35:00+05:30

    మీడియాతో నారా లోకేష్ చిట్‌చాట్

    - రెండు రోజుల క్రితం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యా

    - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి హోంమంత్రి అమిత్ షా రమ్మన్నారు అని చెప్పారు.

    - అమిత్ షా అన్ని కేసుల గురించి అడిగారు....

    - అమిత్ షా దగ్గర చంద్రబాబు భద్రత అంశంపై ఆందోళన వ్యక్తం చేశా

    - అమిత్ షా కూడా కేసుల గురించి ఆరా తీశారు

    - 73 ఏళ్ల వయసు ఉన్న బాబును జైల్లో వేయడంపై అమిత్ షా ఆరా తీశారు

    - రాజమండ్రి జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారని అమిత్ షాకు వివరించా

    - రాజమండ్రి జైల్లో మాజీ నక్సల్స్ ఉన్నారనే అంశాన్ని చెప్పా

    - అమిత్ షాతో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించలేదు

    - చంద్రబాబుపై వైసీపీ అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు

    - శుక్రవారం 17Aపై సుప్రీంకోర్టులో చారిత్రక తీర్పు రాబోతోంది.. ఈ తీర్పు దశాబ్దాల పాటు నిలిచి ఉంటుంది

    - జగన్‌పై ఉన్న కేసులు విచారణకు రాకుండా 2,700 సార్లు వాయిదా కోరారు

    - భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ సీఐడీ చేతికి రావడంపై ఫిర్యాదు చేస్తా

    - ఇండియా కూటమికి, ఎన్‌డీఏ కూటమికి టీడీపీ సమదూరంలో ఉంది

    - చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉంది

    - పార్టీ అకౌంట్లలో ఉన్న నిధులు ఎలక్టోల్ బాండ్స్ ద్వారా వచ్చాయి

    - ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణలో సీఐడీ వాళ్లు 50 ప్రశ్నలు అడిగారు

  • 2023-10-12T15:10:00+05:30

    లాయర్ల తీరుపై ఏసీబీ కోర్టు జడ్జి అసహనం

    - విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై విచారణ

    - సీఐడీ తరపు న్యాయవాదులకు, చంద్రబాబు తరపు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం

    - న్యాయవాదుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

    - ఇలాగైతే విచారణ నిలిపి వేస్తామని స్పష్టం చేసిన న్యాయమూర్తి

    - కోర్టు హాలులో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని ఆదేశం

    - వివాదాలు ఉంటే ఈ కేసు విచారణ చేయలేనని బెంచ్ దిగి వెళ్లిపోయిన న్యాయమూర్తి

    - కేసు విచారణ వాయిదా

  • 2023-10-12T17:00:00+05:30

    ట్రెండింగ్‌లో #CBNJailedForDevelopingAP హ్యాష్ ట్యాగ్

    - ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా 1వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #CBNJailedForDevelopingAP అనే హ్యాష్ ట్యాగ్

    - రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారని ట్విట్టర్ వేదికగా #CBNJailedForDevelopingAP అనే హ్యాష్ ట్యాగ్‌తో వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తున్న నెటిజన్లు

    - చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలుగు ప్రజలు

  • 2023-10-12T16:55:00+05:30

    సీఐడీ కాల్ డేటాపై విచారణ ప్రారంభం

    - విజయవాడ: సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలన్న చంద్రబాబు తరపున న్యాయవాదుల పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభం.

    - చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న దమ్మాలపాటి శ్రీనివాస్

    - సీఐడీ తరపున వాదలు వినిపిస్తున్న వివేకానంద

  • 2023-10-12T15:50:00+05:30

    పీటీ వారెంట్ అంటే అర్థం ఇదే..!!

    పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ ఇస్తుంది. ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరడం. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం.

  • 2023-10-12T16:45:00+05:30

    ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్‌కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. దీంతో సోమవారం నాడు చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఏసీబీ జడ్జి ఆదేశించారు. అంతేకాకుండా క్వాష్ పిటిషన్ విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు ఈనెల 19వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఉంది. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును హాజరుపర్చాలని విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు.