Court Verdict: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

ABN , First Publish Date - 2023-09-19T11:25:59+05:30 IST

చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్‌లపై ఇవాళ హైకోర్టుతో పాటు విజయవాడ సీఐడీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Court Verdict: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Live News & Update

  • 2023-09-19T17:15:00+05:30

    తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు

    - ఉత్తర్వులను రిజర్వ్ చేసిన హైకోర్టు

    - రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామన్న ఏపీ హైకోర్టు

    - ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు వినిపించిన ఇరు వర్గాలు

    - చంద్రబాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా

    - సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

  • 2023-09-19T17:00:00+05:30

    విచారణ రేపటికి వాయిదా

    - విజయవాడ ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా

    - సీఐడీ కస్టడీ, చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా వేయాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు

    - హైకోర్టులో విచారణ జరుగుతోందని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకువచ్చిన చంద్రబాబు తరఫు లాయర్లు

    - విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ కోర్టు

  • 2023-09-19T16:20:00+05:30

    veera babu.jpg

    చంద్రబాబు అభిమాని ఆత్మహత్యాయత్నం

    - కాకినాడ జిల్లాలో చంద్రబాబు అభిమాని ఆత్మహత్యాయత్నం

    - చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి తీవ్ర మనస్తాపం చెందిన వీరబాబు

    - పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వీరబాబు

    - వీరబాబు స్వస్థలం జగ్గంపేట మండలం గుర్రప్పాలెం

  • 2023-09-19T15:55:00+05:30

    కేసుపై పూర్తిగా అధ్యయనం చేయాలి- ముకుల్ రోహత్గీ

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు

    - చంద్రబాబు అరెస్టై 10 రోజులే అయ్యింది

    - ఆయన పిటిషన్ ఇప్పుడు స్వీకరించాల్సిన సమయం కాదు

    - 900 పేజీల డాక్యుమెంట్‌ను కోర్టులో దాఖలు చేశారు

    - పథకం ప్రకారమే స్కామ్ జరిగింది- ముకుల్ రోహత్గీ

    - కేసుపై పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది

    - ఆరు షెల్ కంపెనీలకు డబ్బులు తరలించి విత్ డ్రా చేశారు

    - చంద్రబాబు క్వాష్‌కు అనర్హుడు- ముకుల్ రోహత్గీ

  • 2023-09-19T15:11:00+05:30

    అక్రమ అరెస్టు మానవ హక్కుల ఉల్లంఘన- హరీష్ సాల్వే

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆయన తరఫున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే

    - ఒక్క రోజు అక్రమంగా జైల్లో ఉన్నా మానవ హక్కుల ఉల్లంఘనే...

    - ఈ మేరకు రోమిలా థాపర్ కేస్ ప్రస్తావించిన హరీష్ సాల్వే

    - PC యాక్ట్ 17Aపై వాదనలు వినిపించిన హరీష్ సాల్వే

    - ఎన్నికల దృష్ట్యా దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారు

    - ఈ కేసులో FIRపై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో వేశారు

    - సెక్షన్ 17Aపై కింద తగిన అనుమతులు తీసుకోలేదు

    - ఈ కేసులో FIR చట్టవిరుద్ధమైనది- హరీష్ సాల్వే

    - గత జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు

    - నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు వేళ చట్టబద్ధత పరిగణించాలి

    - 2020లో నమోదైన FIRలో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు?- హరీష్ సాల్వే

    - అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై FIR లేదు- హరీష్ సాల్వే

    - అరెస్ట్ విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదు- హరీష్ సాల్వే

  • 2023-09-19T14:48:00+05:30

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై మళ్లీ వాదనలు ప్రారంభం

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మళ్లీ వాదనలు ప్రారంభం

    - విరామం తర్వాత కోర్టు ముందు వాదనలు వినిపిస్తున్న ఇరువర్గాల న్యాయవాదులు

  • 2023-09-19T13:32:00+05:30

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

    - మధ్యాహ్నం 2: 15 గంటలకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు

  • 2023-09-19T13:10:00+05:30

    harish salve.jpg

    ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు- హరీష్ సాల్వే

    - చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

    - చంద్రబాబు తరఫున వర్చువల్‌గా హరీష్ సాల్వే వాదనలు

    - చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకోలేదు-హరీష్ సాల్వే

    - అవినీతి నిరోధక చట్టంలో తీసుకువచ్చిన సవరణల ప్రకారం ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలి

    - దీనికి సంబంధించి అనేక తీర్పులు ఉన్నాయని ఉదహరించిన సాల్వే

    - ఆర్నబ్ గోస్వామి కేసులో కోర్టు తీర్పును ఉదహరించిన సాల్వే

    - 2021లో నమోదైన ఎఫ్ఐఆర్‌తో ఇప్పుడు చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు?

    - అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్ఐఆర్‌లో అసలు చంద్రబాబు పేరు లేదు

    - ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాతే అరెస్ట్ చేయాలి- హరీష్ సాల్వే

    - చంద్రబాబు విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదు

  • 2023-09-19T12:58:00+05:30

    vishaka womens.jpg

    పోలమాంబ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టిన మహిళలు

    - చంద్రబాబును విడుదల చేయాలంటూ విశాఖలో భారీగా మహిళల ర్యాలీ

    - తొలుత కరకచెట్టు పోలమాంబ ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న మహిళలు

    - అనంతరం ర్యాలీ నిర్వహించిన మహిళలు

  • 2023-09-19T12:35:00+05:30

    చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్ - మధుయాష్కీ

    - చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్

    - జగన్, కేసీఆర్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారు-మధుయాష్కీ

    - జగన్‌ గెలిచేందుకు కేసీఆర్ సూట్‌కేసులు అందించారు

    - బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ ఒక్కటే - మధుయాష్కీ

    - కేసీఆర్, జగన్, మోదీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించాలి-మధుయాష్కీ

  • 2023-09-19T12:30:00+05:30

    చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    - అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

    - కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు

    - ఎల్లుండికి విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

  • 2023-09-19T12:18:00+05:30

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం

    - హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం

    - వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్న ఇరు వర్గాల న్యాయవాదులు

    - చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు

    - చంద్రబాబు అరెస్ట్ చట్టవిరుద్ధం-హరీష్ సాల్వే

  • 2023-09-19T12:14:00+05:30

    ఏసీబీ కోర్టులో విచారణకు మూడు పిటిషన్‌లు

    - విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు మూడు పిటిషన్‌లు

    - చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్

    - పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిన టీడీపీ న్యాయవాదులు

    - తమ నిర్ణయం వచ్చే వరకు కస్టడీ పిటిషన్‌పై ఎటువంటి ప్రక్రియ చేపట్టవద్దని ఇప్పటికే ఆదేశించిన హైకోర్టు

    - చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్లు దాఖలు చేయని సీఐడీ

    - పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు

    - పిటిషన్‌లను పక్కన పెట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

    - లంచ్ తర్వాత హైకోర్టు నిర్ణయం మేరకు విచారణ చేపట్టే అవకాశం

    court.jpg

  • 2023-09-19T12:05:00+05:30

    విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

    - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సింహాచలం కాలినడక యాత్రకు టీడీపీ పిలుపు

    - టీడీపీ పిలుపు నేపథ్యంలో పోలీసులు అలర్ట్.. ముందస్తు అరెస్టులు

    - ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హౌస్ అరెస్ట్

  • 2023-09-19T11:57:00+05:30

    గుంటూరులో టీడీపీ నేతల హౌస్ అరెస్ట్

    - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గుంటూరులో పాదయాత్రకు టీడీపీ పిలుపు

    - టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు

    - పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

    - గుంటూరు తూర్పు టీడీపీ ఇంఛార్జ్ మహ్మద్ నజీర్, నన్నపనేని రాజకుమారి హౌస్ అరెస్ట్

  • 2023-09-19T11:50:00+05:30

    అన్నవరంలో టీడీపీ శ్రేణుల పాదయాత్ర

    - అన్నవరంలో సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టిన టీడీపీ శ్రేణులు

    - టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు

    - మెట్టుమెట్టుకు హారతి వెలిగిస్తూ కొండపైకి చేరుకున్న టీడీపీ శ్రేణులు

    - పాల్గొన్న జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌, వనమాడి కొండబాబు, యనమల కృష్ణుడు

    annavaram.jpg

  • 2023-09-19T11:44:00+05:30

    చెన్నైలో ఐటీ ఉద్యోగుల నిరసన

    - చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చెన్నైలో మహిళలు, ఐటీ ఉద్యోగుల నిరసన

    - నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    - చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

    chennai.jpg

  • 2023-09-19T11:40:00+05:30

    bandla ganesh.jpg

    చంద్రబాబు మళ్లీ గెలుస్తారు.. సీఎం అవుతారు- బండ్ల గణేష్

    - చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్

    - చంద్రబాబు తెలుగు జాతి సంపద.. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ

    - చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు.. సీఎం అవుతారు- బండ్ల గణేష్

    - బాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు

    - చంద్రబాబు పేరు వాడుకుని ఎంతోమంది లబ్ధి పొందారు

    - చంద్రబాబు అరెస్ట్ బాధ కలిగించింది- బండ్ల గణేష్

  • 2023-09-19T11:30:00+05:30

    బుద్ధా వెంకన్న ఇంటి దగ్గర ఉద్రిక్తత

    - విజయవాడలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటి దగ్గర ఉద్రిక్తత

    - దుర్గ గుడికి బయలుదేరిన బుద్ధా వెంకన్న అరెస్ట్

    - పోలీస్ జీపులకు వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

    - పోలీసులు, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం

    - దుర్గ గుడికి వెళ్లాలంటే మీ అనుమతి కావాలా అంటూ బుద్ధా వెంకన్న ఆగ్రహం

    - టీడీపీ నిరసన కార్యక్రమాలను పోలీసులు నీరు గారుస్తున్నారు

    - అమ్మవారికి కొట్టాల్సిన కొబ్బరికాయలను పోలీసుల ముందే కొట్టిన బుద్ధా వెంకన్న

  • 2023-09-19T11:10:00+05:30

    ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్‌లపై ఇవాళ హైకోర్టుతో పాటు విజయవాడ సీఐడీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపించనున్నారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారు.