Covert Politics : బీజేపీలోని ‘ఆ నలుగురు’ కోవర్టులు ఎవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇప్పటి వరకూ అందించిన సీక్రెట్ సమాచారమేంటి..?

ABN , First Publish Date - 2023-06-07T16:05:22+05:30 IST

అవును.. తెలంగాణ బీజేపీలో కోవర్టులు (Coverts In BJP) ఉన్నారు.. కాషాయ పార్టీని బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోంది.. ఇదీ గత ఏడాదిగా కమలనాథులు (BJP Leaders) చెబుతున్న మాటలు...

Covert Politics : బీజేపీలోని ‘ఆ నలుగురు’ కోవర్టులు ఎవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఇప్పటి వరకూ అందించిన సీక్రెట్ సమాచారమేంటి..?

అవును.. తెలంగాణ బీజేపీలో కోవర్టులు (Coverts In BJP) ఉన్నారు.. కాషాయ పార్టీని బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోంది.. ఇదీ గత ఏడాదిగా కమలనాథులు (BJP Leaders) చెబుతున్న మాటలు. అందరూ మీడియా ముందుకొచ్చి ఊదరగొడుతున్నారే తప్ప ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరూ ఒక్క పేరూ చెప్పలేదు. బీఆర్ఎస్ (BRS) నుంచి బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) మొదలుకుని నందీశ్వర్ గౌడ్ (Nandeshwar Goud) వరకూ ‘కోవర్టులు’ గురించే మాట్లాడేస్తున్నారు. అయితే నందీశ్వర్ గౌడ్ మాత్రం 15 రోజుల్లో పేర్లు బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పడంతో దీంతో ఇంటి దొంగలు ఎవరబ్బా..? అంత సాహసం చేస్తున్నదెవరు..? అని రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

bjp.jpg

ఇంతకీ ఎవరా నలుగురు..?

తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఒకరికొకరు పడట్లేదనో.. గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయనో.. ప్రెస్‌మీట్‌లతో ఇలా కమలనాథులు ఎప్పుడూ వార్తల్లో నానుతుంటారు. ఇవన్నీ పక్కనెడితే ఇప్పుడు బీజేపీలో ‘కోవర్టు’ రాజకీయాలు ఎక్కవైపోయాయన్నది రాష్ట్ర కమలనాథులను అయోమయం కలిగిస్తున్న విషయం. వాస్తవానికి చాలా రోజులుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్ని పార్టీల్లో ముఖ్యంగా బీజేపీలో ఎక్కువమంది కోవర్టులు ఉన్నారన్నట్లుగా అప్పట్లోనే సంచలన ప్రకటన చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఎవరనేది మాత్రం బయటికి పొక్కలేదు కానీ.. తాజాగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా ఇలాగే కామెంట్స్ చేయడం మరో 15 రోజుల్లో మీడియా ఆ నలుగురు పేర్లు బట్టబయలు చేస్తానని ప్రకటించడం పెను సంచలనమైంది. దీంతో ఆ నలుగురు ఎవరబ్బా..? బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే ఇలా చేస్తున్నారా..? లేకుంటే కేసీఆర్ పనిగట్టుకుని మరీ బీజేపీ అంతర్గత వ్యవహారాలు కనుక్కోవడానికి పంపారా..? అనేది తేల్చే పనిలో అధిష్టానం ఉందట.

nandeshwar-goud.jpg

ఇందులో నిజమెంత..!?

బీజేపీ అతిపెద్ద జాతీయ పార్టీ.. మహాసముద్రం లాంటిది.. నలుమూలలా ఎప్పుడేం జరిగినా గల్లీ నుంచి ఢిల్లీకి సమాచారం చేరిపోతుంటుంది. చీమ చిటుక్కుమన్నా అగ్రనేతలు తెలిసిపోయే పరిస్థితుల్లో తెలంగాణలో కోవర్టులు ఉన్నారన్న వార్త అంత నమ్మశక్యంగా లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే.. అదేమీ లేదు ఇంతవరకూ పార్టీకి సంబంధించిన విషయాలు పిన్ టూ పిన్ అధికార పార్టీకి కొందరు చేరవేశారు.. కోవర్టులు ఉన్నారన్న మాట అక్షరాలా నిజమేనన్నది కమలనాథుల్లో లోలోపల జరుగుతున్న చర్చట. పోనీ.. ఈ కోవర్టుల గురించి ప్రస్తావన తెచ్చిన నేతలు ఏమైనా చిన్నవారా అంటే అదేమీ కాదు.. రాజకీయాల్లో పండిపోయిన సీనియర్లే కావడంతో ఈ విషయాన్ని అంత ఈజీగా కొట్టేయలేని పరిస్థితి. అయితే ఇంతవరకూ ఈ కోవర్టులు అధికార పార్టీకి సర్వేలతో పాటు అత్యంత రహస్య సమాచారం చేరవేసినట్లుగా చర్చ నడుస్తోంది. నందీశ్వర్ గౌడ్.. పేర్లు బయటపెడతానని ప్రకటించడం, దమ్ముంటే పార్టీని వీడి వెళ్లాలని లేకుంటే బట్టలూడదీసి కొడతాననడంతో తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోందో తెలియక కార్యకర్తలు, నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఇప్పుడిదే సర్వత్రా ఆసకిగా మారింది. అయితే ఈ ప్రకటన చేసి 24 గంటలు దాటినా ఇంతవరకూ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే నందీశ్వర్ పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు గనుకే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. నలుగురున్న మాట నిజమైతే అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

EtelaRajender.jpg

మొత్తానికి చూస్తే.. నందీశ్వర్ గౌడ్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దే రచ్చే రేపుతున్నాయి. ఈ రేంజ్‌లో ఛాలెంజ్ చేసిన ఆయన 15 రోజుల్లో పేర్లు బయటపెడతారో లేకుంటే ఇవన్నీ అవసరమా అని కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారో తెలియాల్సి ఉంది. అయితే ఈయన్ను అతి త్వరలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో హైకమాండ్ ఉందని తాజాగా అందుతున్న సమాచారం. 15 రోజుల సంగతి అటుంచితే.. ఈ రెండు మూడ్రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?

******************************
Ambati Rayudu : ‘అంబటి’ అడుగులు ఎటువైపు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారిన రాయుడు.. వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేస్తారన్న వార్తల్లో నిజమెంత..?

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆప్.. కవితలో పెరిగిన టెన్షన్..?

******************************

Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

******************************

Updated Date - 2023-06-07T16:09:44+05:30 IST