Avinash In Viveka Case : హైదరాబాద్ నుంచి ఎంపీ అవినాష్ ఇంటికి రాకముందే.. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం.. అంతా టెన్షన్ పడ్డారు కానీ..

ABN , First Publish Date - 2023-05-16T17:28:45+05:30 IST

పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ (CBI Enquiry) విషయంలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా..

Avinash In Viveka Case : హైదరాబాద్ నుంచి ఎంపీ అవినాష్ ఇంటికి రాకముందే.. పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం.. అంతా టెన్షన్ పడ్డారు కానీ..

పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) సహ నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ (CBI Enquiry) విషయంలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. విచారణకు హాజరుకావాలని కడప నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) సోమవారం నాడే రావడం.. ఇవాళ బయల్దేరిన తర్వాత ఆఖరి నిమిషంలో సీబీఐను కొంత సమయం అడగటం.. అధికారులు అంగీకరించకపోవడం.. ఆ తర్వాత మళ్లీ అవినాష్ విజ్ఞప్తికి ఓకే అనడం ఇవన్నీ హైదరాబాద్‌లో జరిగిపోయాయి. సీబీఐ నుంచి సానుకూలంగా స్పందన రావడంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు (Hyderabad-Pulivendula) బయల్దేరి వెళ్లారు. అయితే ఈయన పులివెందులకు చేరుకోక ముందే.. ఎంపీ ఇంటికి సీబీఐ బృందం (CBI Officers) వెళ్లింది. దీంతో అసలేం జరుగుతోంది..? అవినాష్‌ను అరెస్ట్ చేస్తారా..? అన్నంతగా పులివెందులలో సీన్ క్రియేట్ అయ్యింది. అయితే.. వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్‌కు అవినాష్‌కు సంబంధించిన నోటీసులు ఇచ్చి అధికారులు అక్కడ్నుంచి తిరిగి వెళ్లిపోయారు. 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ బృందం పేర్కొంది. నోటీసులు మాత్రమే ఇచ్చి సీబీఐ బృందం పులివెందుల నుంచి వెళ్లిపోవడంతో అప్పటి వరకూ ఉలిక్కిపడిన అవినాష్ అనుచరులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Avinash-Reddy.jpg

ఇవాళ ఉదయం నుంచి ఇలా..!

మంగళవారం ఉదయం వివేకా కేసులో సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకావాల్సి ఉంది. అయితే అత్యవసర పనుల వల్ల విచారణకు హాజరుకాలేనని.. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐను ఎంపీ కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా అవినాశ్ లేఖ పంపారు. అయితే తొలుత ఎంపీ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే లేఖను సీబీఐ తిరస్కరించినప్పటికీ అవినాష్ పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకు విచారణకు రావాల్సిందే అంటూ మొదట సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఎంపీ అవినాశ్ సీబీఐ ఆదేశాలను పట్టించుకోకుండా పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు.

Avinash-Reddy-CBI-Enquiry.jpg

ఉత్కంఠకు తెర..

పులివెందులలో ఈరోజు జరగబోయే కార్యక్రమాలను కూడా ఎంపీ రద్దు చేసుకున్నప్పటికీ కడపకు బయల్లేరి వెళ్లారు. అయితే కొన్ని గంటల గడువక ముందే అవినాశ్ లేఖపై సీబీఐ మరోసారి స్పందించింది. ఈసారి సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఈసారి కొత్తగా వాట్సప్ ద్వారా అవినాశ్‌కు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. మొత్తానికి సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుపై ఈరోజు ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. అయితే.. కడపలోనే ఉన్న ఒక సీబీఐ బృందం పులివెందులకు వెళ్లి డైరెక్టుగా నోటీసులు ఇచ్చింది. అవినాష్ అప్పటికింకా హైదరాబాద్ నుంచి రాకపోవడంతో ఎంపీ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి డ్రైవర్‌కు నోటీసులిచ్చి తిరిగి కడపకు చేరుకుంది సీబీఐ బృందం.

ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్..!

గత కొన్నిరోజులుగా అవినాష్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎంపీ విచారణకు హాజరుకాకపోవడం, సీబీఐ నుంచి రెస్పాన్స్ రాకముందే హైదారాబాద్ నుంచి కడపకు బయల్దేరడం.. ఆయన రాకముందే సీబీఐ బృందం పులివెందులకు వెళ్లడం ఈ వరుస పరిణామాలతో జిల్లా వైసీపీ కార్యకర్తలు, ఎంపీ అభిమానులు, అనుచరులు ఏదో జరుగుతోందని ఉలిక్కిపడిపోయారు. అవినాష్ ఇంటి దగ్గర ఒకింత టెన్షన్ వాతావరణమే నెలకొంది కానీ.. నోటీసులు మాత్రమే ఇచ్చి సీబీఐ బృందం వెనుతిరగడంతో ఒకింత హ్యాపీగా ఫీలవుతున్నారట.

******************************

ఇవి కూడా చదవండి..

******************************
Viveka Murder Case : ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాని ఎంపీ అవినాష్.. అనుచరులు వెళ్లడంతో..

******************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

******************************



Updated Date - 2023-05-16T17:39:15+05:30 IST