MP Avinash CBI Enquiry Live Updates : సీబీఐ ఆఫీసు నుంచి వెనుదిరిగిన ఎంపీ అవినాష్.. ఏమైందంటే..
ABN , First Publish Date - 2023-04-17T14:57:39+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఆదివారం నాడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ..
03 : 05 pm : ఇవాళ కాదు రేపు రండి..!
సీబీఐ ఆఫీసు నుంచి వెనుదిరగిన ఎంపీ అవినాష్ రెడ్డి
రేపు ఉదయం (మంగళవారం) 10 గంటలకు రావాలని అవినాష్‌కు చెప్పిన సీబీఐ అధికారులు
అనుచరులతో కలిసి తిరిగి కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరిన ఎంపీ
3:05 pm : వాదనలు ముగిశాకే..
అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 3.45 గంటలకు వాయిదా
అరెస్ట్ చేయకుంటే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం: అవినాశ్ లాయర్
ఈనెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది: సీబీఐ లాయర్
విచారణకు ఎప్పుడు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు: సీబీఐ లాయర్
కోర్టులో వాదనలు మగిశాక విచారణకు హాజరవుతారు: అవినాశ్ లాయర్
3:00 pm : ముందస్తు బెయిల్‌పై విచారణ
వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టుకు అవినాశ్‌రెడ్డి
అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సునీత
తమ వాదనలు కూడా వినాలని కోర్టును కోరిన సునీత
అవినాశ్‌రెడ్డి పిటిషన్ జస్టిస్ సురేందర్‌రెడ్డి బెంచ్‌కి బదిలీ
కాసేపట్లో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
2: 45 pm : ఏబీఎన్‌పై పైశాచికం..!
ABN టీమ్‌ను అడ్డుకున్న అవినాశ్‌రెడ్డి అనుచరులు
కవరేజ్ చేస్తున్న ABN ప్రతినిధులపై దుర్భాషలాడిన అవినాశ్ అనుచరులు
ABN ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కిన అవినాశ్ అనుచరులు
బూతులు తిడుతూ ABN వాహనంపై దాడికి యత్నించిన అనుచరులు
02: 30 pm : ఐదోసారి విచారణకు అవినాష్..
సీబీఐ ఆఫీస్‌కు బయల్దేరిన ఎంపీ అవినాశ్‌రెడ్డి
సాయంత్రం 5 గంటల తర్వాత విచారించనున్న సీబీఐ
వివేకా కేసులో అవినాశ్‌కు ఐదోసారి సీబీఐ నోటీసులు
వివేకా హత్య కేసులో అవినాశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఆదివారం నాడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే అవినాష్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి అవినాష్ కాన్వాయ్‌లో బయల్దేరారు. ఇంతలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులివ్వగా.. 3:45 నిమిషాలకు హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు అవినాష్‌ను విచారించొద్దన్న సీబీఐను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు స్పందించిన సీబీఐ.. సాయంత్రం 5 తర్వాతే విచారణకు పిలుస్తామని తెలిపింది.