Shocking Video: వామ్మో.. ఇంత భారీ కొండచిలువా? చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. చెట్ల మీదకు ఎలా పాకుతోందో చూడండి..

ABN , First Publish Date - 2023-08-29T15:25:50+05:30 IST

విషసర్పాలన్నా, భారీ కొండచిలువలన్నా భయపడని వారు ఎవరూ ఉండరు. వాటిని చూడడానికే చాలా మంది భయపడతారు. అవి ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రజలకు షాకింగ్ అనుభవం ఎదురైంది.

Shocking Video: వామ్మో.. ఇంత భారీ కొండచిలువా? చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది.. చెట్ల మీదకు ఎలా పాకుతోందో చూడండి..

విషసర్పాలన్నా (Snakes), భారీ కొండచిలువలన్నా (Huge Python) భయపడని వారు ఎవరూ ఉండరు. వాటిని చూడడానికే చాలా మంది భయపడతారు. అవి ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా (Australia)లోని క్వీన్స్‌ల్యాండ్ ప్రజలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. 16 అడుగుల పొడవున్న ఓ భారీ కొండచిలువ (16-foot huge python) వారిని భయభ్రాంతులు గురిచేసింది. దీంతో వారందరూ అరుపులు, కేకలు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).

@Levandov_2 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొండ చిలువ ఇంటి టెర్రస్ పై నుంచి పక్కనే ఉన్న చెట్టు మీదకు పాకుతోంది. 16 అడుగుల పొడవున్న ఆ కొండ చిలువ చాలా సునాయాసంగా ఇంటి నుంచి చెట్టు మీదకు, అక్కడి నుంచి మరో చెట్టు మీదకు వెళ్లిపోతోంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై కేకలు వేశారు. కొద్ది సేపు వారి వైపు చూసిన కొండచిలువ ఆ తర్వాత మరో చెట్టు మీదకు వెళ్లిపోయింది (Shocking Video).

Viral: ఈ ఆటో డ్రైవర్ ఎంతో మందికి స్ఫూర్తి.. 38 ఏళ్ల క్రితం వదిలేసిన చదువు మళ్లీ మొదలు పెట్టి..

వైరల్ అవుతున్న ఆ వీడియో చాలా మందిని భయపెడుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 4 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా వైల్డ్‌గా ఉంది``, ``చాలా షాకింగ్‌గా ఉంది``, ``ఆస్ట్రేలియాలో ఇలాంటి దృశ్యాలు చాలా కామన్``, ``అవి చెట్ల మీద వేటాడతాయి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-29T15:25:50+05:30 IST