Viral News: ఏం తెలివి బ్రదరూ నీది.. 3 రూపాయలు ఖర్చు చేస్తే చాలు.. ఏకంగా 30 కిలోమీటర్లు నడిచే ఈ బైస్కిల్..!
ABN , First Publish Date - 2023-04-20T17:49:19+05:30 IST
3 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్లు నడిచే ఈ- బైస్కిల్ తయారు చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు.
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల దగ్గర నుంచీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో పేదల దగ్గర నుంచీ సామాన్యుల వరకూ డబ్బులు ఖర్చు చేయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి దుస్థితి ఏర్పడింది. కారణం పెరిగిన ధరలే ఇందుకు నిదర్శనం. అంతగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.110 ఉంది. దీంతో చాలా మంది అవసరమైతే తప్ప ఎక్కువగా వాహనాలు ఉపయోగించడం లేదు. ఇక వాహనాల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడికి వినూత్న ఆలోచన వచ్చింది. 3 రూపాయల ఖర్చుతో 30 కిలోమీటర్లు నడిచే ఈ- బైస్కిల్ తయారు చేసి శెభాష్ అనిపించుకుంటున్నాడు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఛతర్‌పుర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్‌హరే (20) అనే యువకుడు (20 year old) ఈ-బైస్కిల్‌ను (electric bicycle ) రూపొందించాడు. ఈ సైకిలు దాదాపు వంద కేజీల బరువును మోసుకెళ్లేలా తయారు చేశాడు. ఈ సైకిల్ పేద ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచనతోనే బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించినట్లు ఆదిత్య పేర్కొన్నాడు.
ఈ సైకిల్ తయారు చేసేందుకు ఆదిత్య నెల రోజులు శ్రమించాడు. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తయారు చేస్తూ ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు ఆదిత్య. దీని తయారీకి రూ.20 వేల ఖర్చయింది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణించవచ్చు. అంటే పది పైసల ఖర్చుతో కిలోమీటరు దూరం ప్రయాణించవచ్చు. ఈ సైకిలుకు బైక్‌కు ఉండే కొన్ని సౌకర్యాలను కూడా ఆదిత్య కల్పించాడు. ఇక ఈ బ్యాటరీ సైకిల్‌కు ‘తి-1’ అని పేరు కూడా ఆదిత్య పెట్టాడు. ఇక ఆలస్యమెందుకు ఇలాంటి సైకిళ్లు అందుబాటులోకి వస్తే.. పొల్యుషన్ ఉండదు. డబ్బులు కూడా ఆదా అవుతాయి.
ఇది కూడా చదవండి: Viral Video: పెంపుడు కుక్కను తీసుకుని పార్కుకు వెళ్తే షాకింగ్ అనుభవం.. ప్రాణభయంతో పరుగులు తీసిన మహిళ..!
ఇది కూడా చదవండి: Husband: 11 బస్తాల్లో 10 రూపాయల నాణేలు.. నేరుగా కోర్టుకే తెచ్చిచ్చిన భార్యపై వెరైటీగా కసి తీర్చుకున్న భర్త..!