కాంటాక్ట్ లెన్స్ ఇంత డేంజరా.. ఇతనికి ఏం జరిగిందో తెలిస్తే ఎప్పటికీ వాటివైవు వెళ్ళరు..

ABN , First Publish Date - 2023-02-18T18:44:59+05:30 IST

కాంటాక్ట్ లెన్స్(contact lens) వాడుతున్నారా.. లేక కాంటాక్ట్ లెన్స్ వాడాలనే ఆలోచనలో ఉన్నారా?

కాంటాక్ట్ లెన్స్ ఇంత డేంజరా.. ఇతనికి ఏం జరిగిందో తెలిస్తే ఎప్పటికీ వాటివైవు వెళ్ళరు..

మీరు కళ్ళజోడు బ్యాచేనా? కళ్ళజోడు వాడుతూ విసిగిపోయి కాంటాక్ట్ లెన్స్(contact lens) వాడుతున్నారా.. లేక కాంటాక్ట్ లెన్స్ వాడాలనే ఆలోచనలో ఉన్నారా? ఒకవేళ కాంటాక్ట్ లెన్స్ వాడాలనే ఆలోచన ఉంటే మాత్రం కాస్త ఆగండి.. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు పుడుతున్నాయా? కాంటాక్ట్ లెన్స్ వాడటం వల్ల 21 ఏళ్ళ కుర్రాడికి ఏమయ్యిదో చదివారంటే మీకే అర్థమవుతుంది.

ఇప్పటికాలంలో చిన్నతనంలోనే కళ్లజోడు వాడాల్సి వస్తోంది చాలామందికి. కళ్ళజోడు కొందరికి ఫ్యాషన్ అయితే.. మరికొందరికి చిరాకు తెప్పిస్తుంది. ఈ కళ్ళమీది భారానికి ప్రత్యామ్నాయంగా కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. కానీ 21 ఏళ్ళ కుర్రాడు చేసిన చిన్న పొరపాటు అతని చూపు కోల్పోయేలా చేసింది. అమెరికా(America) ఫ్లోరిడా (Florida)కు చెందిన క్రుమ్ హోల్జ్ అనే కుర్రాడు గత 7ఏళ్ళ నుండి కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు పడుకునేముందు వాటిని తీసేయాలి. కానీ క్రుమ్ హోల్జ్ తన కాంటాక్ట్ లెన్స్ ను ఒక్కోసారి తీయకుండా అలాగే పెట్టుకుని నిద్రపోయేవాడు. దీనికారణంగా అతనికి పింక్ ఐ, కంటి ఇన్ఫెక్షన్లు అప్పుడప్పుడు వచ్చేవి. ఈ ఇన్ఫెక్షన్లకు అతను అలవాటు పడిపోయాడు. ఒకరోజు అతను తన పని అయిపోయాక బాగా అలసిపోయి కాంటాక్ట్ లెన్స్ లు తీయకుండా అలాగే నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం లేవగానే అతని కన్ను చాలా ఇబ్బందిగా అనిపించింది. కన్ను వెనుక భాగంలో నొప్పిగా అనిపించింది. ఇదేదో కంటి ఇన్ఫెక్షన్ కావచ్చు అనుకున్నాడు. కానీ తల ముందుకు వెనక్కు ఊగినట్టుగా అనిపిస్తుండట డాక్టర్ ను సంప్రదించాడు.

lens2.gif

క్రుమ్ హోల్జ్ ను పరిశీలించిన డాక్టర్ అతనికి ఏమయ్యిందో తెలియక డైలమాలో పడిపోయాడు. ఆ తరువాత మరికొంతమంది వైద్యులతో చర్చించి క్రుమ్ హోల్డ్ సమస్యపై పరిశోధన చేశాడు. వారందరూ క్రుమ్ హోల్జ్ కుడి కంటిలో అకాంతమోబిక్ కెరాటిటిస్(acanthamoeba keratitis) అనే పరాన్నజీవి ఉన్నట్టు కనుగొన్నారు. ఈ పరాన్నజీవి కాంటాక్ట్ లెన్స్ ద్వారా కళ్లలోకి ప్రవేశించి కళ్ళలో ఉన్నకణజాలాన్ని తినేస్తుందట. ఈ పరాన్నజీవి వల్ల క్రుమ్ హోల్జ్ కుడి కన్ను దెబ్బతినింది. అతను చూపు కోల్పోయాడు. ఈ కారణంగా అతను 50రోజులు ఎలాంటి పనులు చేయలేక నరకం అనుభవించాడు. అన్ని రోజులూ అన్ని పనుల కోసం కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డాడు. ఇతని కంటిలో ఉన్న ఈ పరాన్నజీవిని కనుగొనడానికి 5మంది వైద్యులు సుమారు నెల రోజులు పరిశోధించారు. ఇది చాలా అరుదైనదని, కాంటాక్ట్ లెన్స్ లు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టాన్నిచూడాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. జాగ్రత్త మరి..

Read also: పోలీస్ స్టేషన్‌లో పెళ్లి పంచాయితీ.. ఇద్దరిలో ఆ వరుడు ఎవరిని చేసుకోవాలన్నదానిపై ఎడతెగని చర్చ.. అసలు కథేంటంటే..!


Updated Date - 2023-02-18T18:49:37+05:30 IST